Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

నిశ్చయతాంబూలాలు (నిశ్చితార్ధం): Niscayatambulalu ( engaged ) :

నిశ్చయతాంబూలాలు (నిశ్చితార్ధం):

ముందుగా అబ్బాయిని, అబ్బాయి తల్లిదండ్రులను, అమ్మాయిని, అమ్మాయి తల్లిదండ్రులను కూర్చొనపెట్టి బ్రాహ్మణుడు తాంబూలములు మార్పించును. అబ్బాయి వాళ్ళు అమ్మాయికి, అమ్మాయి వాళ్ళు అబ్బాయికి బట్టలు పెట్టుదురు. అవి మార్చుకుని వచ్చిన తరువాత ఇద్దరిని కుర్చీలలో కూర్చొనపెట్టుదురు. ఒకరికిఒకరు దండలు వేసుకొందురు. కేకు కట్‌ చేయుదురు. కూల్‌డ్రింక్‌ తాగించటము, జీడిపప్పు తినిపించటము వంటివి సరదాగా చేయించెదరు.

పెండ్లికుమారునకు కావిళ్ళు:
పాలకావిడ - బిందె, గ్లాసు, స్పూను, బట్టలు
ఉషోదయ కావిడ - అద్దము, బ్రష్‌, పేస్టు, దువ్వెన, షేవింగ్‌ సెట్‌
డ్రింకు కావిడ - కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌
జున్ను కావిడ - కప్పులో జున్ను, స్పూను
పండ్లు, స్వీటు, హాట్‌, బిస్కెట్‌, వాచీలు, సెల్‌ఫోన్‌, మగపిల్లలకు సంబంధించిన ఏదైనా ఇవ్వవచ్చును.

పెండ్లికూతురునకు కావిళ్ళు:
బట్టలు, బంగారపు వస్తువు, తాంబూలాల నిమిత్తము పెట్టుదురు. చీర, డ్రస్సు, గాజులు, పర్సు, గోరింటాకు, దీపాల కావిడ, పట్టీ, సౌందర్య కావిడ, వాచీ, పూజ కావిడ, దీపాల కావిడ, కాలక్షేపం కావిడ. 
నిశ్చయతాంబూలములో ఆకు, వక్క, పండ్లు, కొబ్బరిబోండము, వెండివి ఇవ్వవచ్చును.

Popular Posts

Popular Posts

Ads