Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

పూజ ఎలా చేయాలి. ఎవరు ఎవరికి చేయాలి: How to worship . Who else should be done :

పూజ ఎలా చేయాలి. ఎవరు ఎవరికి చేయాలి:
పరమాత్మ నుండి విడివడిన ఈ జీవాత్మను(మానవ ఉపాధిని ఆశ్రయించిన) మరలా పరమాత్మలో చేర్చడానికి ప్రతి మానవ ఉపాధి పరమాత్మ ప్రసన్నత కొరకు పూజ చేయాలి. పూజ చేస్తే అంతఃకరణశుద్ధి, ధర్మబద్దమైన జీవనము అలవాటై జీవాత్మ పరమాత్మ వైపుకు తిరుగుతుంది.
ప్రతి మానవుడు సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తములో నిద్రలేవాలి. బ్రహ్మ ముహూర్తమానగా సూర్యోదయానికి 88 ని|| ముందు ఉన్న కాలమును బ్రహ్మముహూర్తకాలమని అంటారు. నిద్ర ఎలా లేవాలి?
1) ప్రతి రోజూ నిద్రనుండి మేలుకువ వస్తోంది అని తెలియగానే మన మనస్సులో మన కులదైవం పాదాలను దర్శించాలి. ప్రణమిల్లాలి.(నమస్కరించాలి). 
2) శ్రీ హరి, శ్రీ హరి, శ్రీ హరి అంటూ నిద్రలేవాలి.
3) నిద్ర నుండి లేవగానే తన చేతులు (అరచేతులు) చూచుకోని మనస్సులో నమస్కరించాలి.
“కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతీ,
కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం” అన్నారు ఆర్యులు.
1) భూమి మీద కాలు మోపే ముందు భూమాతకు నమస్కరించి భూమిపై పాదములు (ముందు కుడిపాదము, తర్వాత ఎడమ పాదము)పెట్టాలి.
2) నిద్రలేచి భూమి మీద నిలబడగానే మన మనస్సులో మన గురువు గారిని వారి పాద పద్మములను స్మరిస్తూ(నిజంగా గురువు గారే మన ముందు నిలుచున్న భావనతో) నమస్కరించాలి.
తమ తమ ఇష్ట దైవములను పూజ చేయుటకు ఉపక్రమించాలి.శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, శ్రీ వెంటకేశ్వరుడు,శివుడు, శ్రీ వినాయకుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు, సాయిబాబా, లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి, అల్లా, జీసస్, ఎవరైనా కావచ్చు. నిజానికి భగవంతునికి లింగ బేధము లేదు. పరమేశ్వరుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు అరూపరూపి. వారి వారి నమ్మకములను బట్టి వారి వారి గురూపదేశమును బట్టి పూజిస్తారు.
సూర్యుడు ఉదయించక పూర్వము మరలా సూర్యుడు అస్తమించక పూర్వము (సూర్యుడు అస్తమించేముందు). పూజ చేయాలి.ఎందుకు?
సూర్యుడు బ్రహ్మ, విష్ణు, శివాంశ స్వరూపముల కలయికే సూర్యభగవానుడు. యదార్థమునకు సూర్యుని స్వరూపము ఒక కాంతి ముద్ద. ఈ మాంస నేత్రములతో చూడగలిగిన ప్రత్యక్ష దైవం సూర్యుడు. “ఆరోగ్యం భాస్కరాద్యిచ్ఛేత్”. కావున సూర్యభగవానుని గమనాన్ని అనుసరించి, పూజాదికార్యక్రమాలు జరగాలి. కాలకృత్యములు తీర్చుకొన్న తర్వాత స్నానం చేయాలి. పరబ్రహ్మ స్వరూపమైన ప్రాతఃకాల సూర్యుడు ఉదయించే సమయానికి:-యజ్ఞోపవీతం(జంధ్యము) ఉన్న ప్రతి ఒక్కరూ సంధ్యావందనం చేయాలి.కేవలం యజ్ఞోపవీతం ఉన్నవారే కాదు అందరూ కూడా సంధ్యావందనం చేయవచ్చు.
“బ్రహ్మే ముహూర్తే ఉత్తిష్టేత్” అందుకు చెప్పింది వేదము. బ్రహ్మ ముహూర్తము సూర్యోదయానికి 88 ని|| ముందు లేచి స్నానము చేసి సంధ్యావందనం పూర్తి చేసుకొని ఆర్ఘ్యం ఇచ్చేసి సంధ్యావందన గాయిత్రి జపం చేస్తున్నవాడవై భగవంతునకు స్వాగతం పలుకుచున్నట్లు గాయత్రి జపం చేస్తూ ఉండాలి.

Popular Posts

Popular Posts

Ads