Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

ఏది శాశ్వతము What is the permanent Edi Sasvatamu

మనము అందరమూ విజ్ఞానవంతులం. చదువుకొన్నాం. ఏదైనా ఒక విషయమును లోతుగా చర్చించగలము. బాగా ఆలోచించగలము. ఔనా? అయితే మనము పూజలు చేసే దేవుళ్ళు( రాముడు, కృష్ణుడు,శివుడు, సాయిబాబా, లక్ష్మీదేవి) ఇలా ఎంతోమంది. వారివారి అభిమతమును బట్టి, విశ్వాసమును బట్టి వారి పూర్వీకుల ఆచార వ్యవహారములను బట్టీ ఆయాదేవుడు. ఈ ఉపాధిని(మానవ శరీరమును) సృజించినది దేవుడు. కదా?మరి ఈ ఉపాధి శాశ్వతమా? దేవుడు సృష్టిస్తున్నాడు, చెట్లను, రకరకాల ప్రాణులను, అడవులను, నీటిని, గాలిని మరి అవి శాశ్వతమా? మానవుడు సృష్టించిన ఈ ధనము, బంగారము, మిద్దెలు, మేడలు, శాశ్వతమా? ఆలోచించండి. దేవుడు సృష్టించిన సృష్టికే శాశ్వతత్వము లేనప్పుడు మనము సృష్టించుకొన్న ఈ విషయ వాసనలు శాశ్వతమా? ఎందుకు మనకు ఇంత వ్యామోహం. ఆలోచించండి.
కనీసం యుగములు శాశ్వతమా? కృతయుగం,త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఏ యుగము శాశ్వతముగా ఉందో ఆలోచించండి? ఆయా యుగ కర్తలు ఆ యుగములలో ధర్మరక్షణకు ధర్మసంస్థాపనకు వచ్చిన మహాపురుషులు దేవుళ్ళు, వారైనా శాశ్వతమైయున్నారా? వారి గుణములను వారి ధర్మవర్తనను ఈనాడు మనము కీర్తిస్తున్నాము, భజించుచున్నాము , పూజించుచున్నాము కానీ ఆచరణమునకు మాత్రం ప్రయత్నించడం లేదు. లేదా ధర్మమును ఆచరించాలి, అనే ప్రయత్నమును గురించి కూడా ఆలోచింపము. ఔనా? ఎలాగంటే ప్రసూతి వైరాగ్యము,శ్మశాన వైరాగ్యము లా ఉంటుందే కానీ, ఆచరణకు మాత్రం ధర్మం యోగ్యముకాదు. ఔనా? గుడిలోనో, ఉపన్యాసము వింటున్నప్పుడో, లేదా ఏదేని ఉత్సవాలు జరుగుచున్నప్పుడో అందరూ ధర్మపన్నాలు వల్లిస్తాం. బయటకు రాగానే యధా జీవితం. ఔనా? కాదా?మనకు మనము ఆత్మవిమర్శ చేసుకుందాం. ఆలోచిద్దాం. త్రేతాయుగము చివరన శ్రీ రామ నిర్యాణం జరుగలేదా? ద్వాపరయుగం ఆఖరున శ్రీ కృష్ణ నిర్యాణం జరుగలేదా? మనము చదువుకోలేదా? తెలుసు బాగా తెలుసు. ఆలోచించండి మనము శ్రీరామచంద్ర ప్రభువు కంటే గొప్పవారమా? శ్రీ కృష్ణ పరమాత్మ కంటే జ్ఞానులమా, అధికులుమా? మరి ఏంటి మన గొప్ప. మన డాబు, మన దర్పం,మన అహం ఇలాంటి అరిషడ్వార్గాలను నిత్యమూ పెంచిపోషిస్తున్నాము. ఈ పెంచి పోషించిన ఫలము కూడా మనకు తెలుసు. అందుకే శ్రీ పోతన గారు భాగవతములో “లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుదిని పెంచీకటి కవ్వల నేవ్వండేకాకృతి వెలుగు, అతనినే భజింతున్ ” లోకాలు లోకాది దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లోకస్తులు అందరూ వెళ్ళిన తర్వాత కూడా చివరలో ఈ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అలాగా అన్నీ లోకములు లోకముల దేవతలు అధిపతులు పోయినా కూడా అంత గాఢాంధ కారములో ఏ పరబ్రహ్మము, జ్యోతి స్వరూపముతో నిలబడి ఉందో ఏ పరదేవత ఉందో వారికి నేను నమస్కరిస్తాను. వారే శాశ్వతులు. యుగాలను, యుగపురుషులను, లోకాలను,లోకాధిపతులను సృజించే పరదేవతే ఆపరమాత్మే నిత్యుడు,శాశ్వితుడు.

Popular Posts

Popular Posts

Ads