Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు The Results Of Donating Danalu Ceyadam Valana Kalige Phalitalu Daanaalu Chaeyadam Valana Kaligae Phalitaalu

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు.!💐శ్రీ💐
శ్రీ మాత్రే నమః..!!🙏
1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
2. వెండిని దానం చేస్తే – మనశ్మాంతి కలుగుతుంది.
3. బంగారం దానం చేస్తే – దోషాలు తొలుగుతాయి.
4. పండ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
5. పెరుగు దానం చేస్తే – ఇంద్రియనిగ్రహం కలుగుతుంది.
6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
7. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.
8. తేనె దానం చేస్తే – సంతానం కలుగుతుంది.
9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతుంది.
10. టెంకాయ దానం చేస్తే – అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.
11. దీపాలు దానం చేస్తే – కంటి చూపు మెరుగు పడుతుంది.
12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది
14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతుంది.
15. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.
పైవన్నీమన వేదాల్లో చెప్పినవే…
వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం.
చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా,
శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.
🙏🏻ధర్మోరక్షతి రక్షితః🙏🏻

ఓం నమః శివాయ..అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు, నిత్యం ఈ స్తోత్రం చదవాలి. Om Namah Sivaya Anarogyanto Badhapadutunnavaru Arogyanga Jivincalanukunevaru Nityam I Stotram Cadavali

ఓం నమః శివాయ..అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు, నిత్యం ఈ స్తోత్రం చదవాలి. Om Namah Sivaya Anarogyanto Badhapadutunnavaru Arogyanga Jivincalanukunevaru Nityam I Stotram Cadavali

Om Namah Shivaya .. Those who are sick, want to live healthy, should read this hymn.

ఓం నమః శివాయ..!!🙏
అనారోగ్యంతో బాధపడుతున్నవారు,
ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు,
నిత్యం ఈ స్తోత్రం చదవాలి.
మన జీవితంలొ ఒక్కసారి అయిన ఈనామాలు చదవాలి.
కాశీఖండము లోని యముని చే చెప్పబడిన శివుడు..విష్ణువు ఇద్దరు తో కూడిన నామాలు ఒక్కసారి చదివినా అనేక జన్మల పాపాలు పోతాయి.
ఈ నామాలనూ ప్రతిరోజు పఠించే వాళ్ళకి యమదర్శనం వుండదు.
యముడు స్వయంగా తన యమభటులు కు
ఈ శివకేశవ నామాలు ఎవ్వరు భక్తితో రోజు చదువుతూ వుంటారో వారి జోలికి మీరు పోవద్దు అనిచెప్పాడు.
యమకృత_శివకేశవ_స్తుతి.!!🙏
గోవింద మాధవ ముకుంద హరే మురారే,
శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే !
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
గంగాధరాంధకరిపో హర నీలకంఠ,
వైకుంఠ కైటభరిపో కమలాబ్జపానే !
భూతేశ ఖండపరశో మృడ చండికేశ,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే,
గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ !
నారాయణాసుర నిబర్హణ ,శార్జ్గపాణే,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో,
శ్రీకాంత పీతవసనాంబుదనీల శౌరే !
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
లక్ష్మిపతే మధురిపో పురుషోత్తమాద్య,
శ్రీకంఠ దిగ్విసన శాంతి పినాకపానే !
ఆనందకంద ధరణీధర పద్మనాభ,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ,
బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపానే !
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌలే,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే,
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ!
చానూరమర్దన హృషీకపతే మురారే,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
శూలిన్ గిరీశ రజనీశకళావతంస,
కంసప్రణాశన సనాతన కేశినాశ!
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
గోపీపతే యదుపతే వసుదేవసూనో,
కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర !
గోవర్దనోద్దరన ధర్మధురీణ గోప,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!*
స్థానో త్రిలోచన పినాకధర స్మరారే,
కృష్ణానిరుద్ద కమలానాభ కల్మషారే !
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!
ఈ యమకృత శివకేశవ నామాలను స్మరించువారు పాపరహితులై తిరిగి మాతృగర్బమున జన్మించరు.
‌‌‌ ఓం శివ నారాయణాయ నమః🙏

శ్రీరామ జయరామ జయ జయరామ..!! Sreeraama jayaraama jaya jayaraama

శ్రీరామ జయరామ జయ జయరామ..!!
స్కంద పురాణంలో..బ్రహ్మ ఖండంలో..రామేశ్వర క్షేత్రంలో 24 తీర్ధాలు ఉన్నట్లు వర్ణించబడింది. అవి..
చక్ర తీర్ధం,
భేతాళ వరద తీర్ధం,
పాప వినాశనం,
సీతా సరస్సు,
మంగళ తీర్ధం,
అమృత వాపిక,
బ్రహ్మ కుండము,
హనుమత్కుండం,
అగస్త్య తీర్ధం,
రామ తీర్ధం,
లక్ష్మణ తీర్ధం,
జటా తీర్ధం,
లక్ష్మీ తీర్ధం,
అగ్ని తీర్ధం,
శివ తీర్ధం,
శంఖ తీర్ధం,
యమునా తీర్ధం,
గంగా తీర్ధం,
గయా తీర్ధం,
కోటి తీర్ధం,
స్వాధ్యామృత తీర్ధం,
సర్వ తీర్ధం,
ధనుష్కోటి తీర్ధం,
మానస తీర్ధం.
రావణాసురుని చంపిన బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తుడు అవటానికి శ్రీ రాముడు శివలింగ ప్రతిష్టాపనను రామేశ్వరంలో చేయ సంకల్పించాడు.
సముద్రానికి ఇవతలి ఒడ్డు అయిన "పుల్ల'' గ్రామానికి దగ్గరలో, సేతువుకు సమీపంలో, గంధమాదన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్టించాలని రామ సంకల్పం.
హనుమంతుని కైలాసం వెళ్లి శివుని అనుగ్రహంతో లింగాన్ని తెమ్మని రాముడు పంపాడు.
ముహూర్త విషయాన్ని కూడా తెలిపి,
ఆ సమయం లోపలే తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు.
హనుమంతుని రాక ఆలస్యమై ముహూర్తం మించి పోతుండగా, మహర్షుల అనుమతితో సీతాదేవి
ఇసుకతో లింగాన్ని చేస్తే, సరిగ్గా ముహూర్త సమయానికి దాన్ని ప్రతిష్టించాడు శ్రీ రామచంద్రుడు'.
ఆ లింగానికి అభిషేకం జరిపి, పూజ కూడా చేసేశాడు. మారుతి శివలింగాన్ని తీసుకొని వచ్చాడు.
విషయం తెలిసి బాధపడి తాను తెచ్చిన లింగాన్ని
ఏమి చేయాలని రామున్ని ప్రశ్నించాడు.
దానికి ఆయన వేరొక చోట ప్రతిష్టించమని చెప్పాడు.
హనుమకు కోపం వచ్చి "రామా! నన్ను అవమానిస్తావా? సైకైకత లింగాన్ని ప్రతిష్టించాలి అని అనుకొన్నప్పుడు నన్నెందుకు కైలాసం పంపావు?
ఇంకో చోట ప్రతిష్ట చేయటం కోసమా నేను
అంత దూరం వెళ్లి తెచ్చింది?
నాకీ జీవితం వద్దు.
నా శరీరాన్ని సముద్రుడికి త్యాగం చేస్తాను "
అని దూకబోతుండగా రాముడు వారించాడు"’
అన్నా హనుమన్నా! మనిషి తను చేసిన కర్మఫలాన్ని అనుభవిస్తాడు.
ఆత్మను చూడు.
దుఖం పొందటం వివేకికి తగనిపని.
దోషాన్ని వదిలి మంచిని గ్రహించు.
నువ్వు తెచ్చిన లింగాన్ని వేరే చోట స్థాపిద్దాం.
ఈ రెండు లింగాలను దర్శించినా, స్మరించినా,
పూజించినా పునర్జన్మ ఉండదు.
భక్తులు ముందుగా నువ్వు తెచ్చిన శివలింగాన్ని పూజించి, ఆ తర్వాతే ఇసుక లింగాన్ని పూజిస్తారు.
అలా కాకపోతే ఈ సైకత లింగాన్ని పీకేసి
సముద్రంలో విసిరెయ్యి'' అన్నాడు.
అప్పుడు హనుమ తన తోకను ఇసుకలింగం చుట్టూ బిగించి పెకలించటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు.
అది ఇసుమంత కూడా కదలలేదు.
మళ్ళీ ప్రయత్నం చేసి వీలుగాక నెత్తురు కక్కుకొంటు దూరంగా పడిపోయాడు.
పడిన చోట హనుమ ముక్కులు, చెవులు, నోటి నుండి విపరీతంగా రక్తం కారి ఒక సరస్సుగా మారింది.
హనుమ స్పృహ కోల్పోయాడు.
అప్పుడు రాముడు మారుతి పడి ఉన్న ప్రదేశానికి వెళ్ళి, అతని శిరస్సును తన ఒడిలో పెట్టుకొని సేదతీర్చాడు. అతన్ని ఆదరంగా పిలుస్తూ లేవమని కన్నీరు మున్నీరు కార్చాడు దయా సముద్రుడు రామ చంద్రుడు. కొంతసేపటికి హనుమంతునికి తెలివి వచ్చింది.
అప్పుడు హనుమ తెచ్చిన విశ్వేశ్వర లింగాన్ని సీతారాములు ప్రతిష్టించారు.
హనుమ పడిన ప్రదేశం అంతా రక్తపు మడుగైంది.
అదే "హనుమత్కుండం''.
ఇది రామేశ్వరానికి కొద్దిదూరంలో ఉంది.
దీనిలో స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని
రాముడు ప్రకటించాడు.
పితృదేవతలకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే
స్వర్గానికి వెళ్తారని సీతా రాములు అనుగ్రహించారు.

చండీ హోమము విశిష్టత Chandih Omam Vishishtata

చండీ హోమము విశిష్టత
మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం
చండీ మాత చాలా ప్రచండ శక్తి. ఒక్క భూగ్రహమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమే ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి! అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం.
లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని స్ర్తీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య. అది
లలితాపారాయణం,
చండీపారాయణం
అని రెండు రకాలు.
బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం
చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.
1. చండీ హోమం లో ఉన్న మంత్రాలు & అధ్యాయాలు :
చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రాహ్మీ, నందజా, రక్తదంతికా, శాకంబరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది.
దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, నియుత (లక్ష) చండీ యాగం, ప్రయుత (పది లక్షలు) చండీ యాగం ఉంటాయి.
2. చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు:
ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది.
కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.
వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట.ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మను చండి (చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక, శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి. లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండి అంటారు. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు.
వీటిలో చండీ హోమం, నవ చండీ, శత చండీ యాగాలను తరచుగా, సహస్ర చండీ యాగాలను అరుదుగా చేస్తుంటారు. అయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు..

Popular Posts

Popular Posts

Ads