పంచ కన్యలు అంటే ఎవరు,

 అహల్యా ద్రౌపదీ కుంతీ (తారా) తారామండోదరీ తథా పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్… అన్న శ్లోకం ప్రసిద్ధం.అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి.

ఈ ఐదుగురు పంచకన్యలు.వీరిని ప్రతి నిత్యమూ స్మరించాలని పండితులు చెబుతున్నారు.

ఆ స్మరణ మహా పాతకాలను నశింప జేస్తేంది అని భావం.శ్లోకంలో కుంతికి బదులు తార పేరును రెండు సార్లు చెప్తుంటారు కొంత మంది.

ఒక తార బృహస్పతి భార్య కాగా.మరొక తార వాలి భార్య అని గ్రహించాలి.

కుంతిని గ్రహిస్తే ఒక తారనే చెప్పాలి.అహల్య గౌతముని భార్య, ద్రౌపది పంచ పాండవుల ధర్మ పత్ని.

కుంతి పాండురాజు భార్య, మండోదరి రావణుని భార్య.

ఈ పంచకన్యలూ మహా పతివ్రతలు.అద్భుతమైన అంద చందాలు కలవారు.వీరిని బ్రహ్మ విశిష్టమైన దివ్య లక్షణాలతో సృష్టించాడు.

No comments:

Post a Comment