పరమేశ్వరుడు కలియుగం ప్రారంభమైన తర్వాత కలి ప్రభావంతో కలియుగము లో మానవులు ధర్మమార్గమును అనుసరించుటకు అనువైన పద్దతులను అందులోని ధర్మసూక్ష్మాలను మానవ జాతికి అందించడానికి మరియు కలియు గంలో ధర్మము నాలుగు పాదముల మీదకాక ఒంటికాలిమీద కుంటి నడక నడుస్తుందని ధర్మదేవతకు మరియు సనాతన ధర్మములకు వాటి ఆచరణము లకు విపరీతమైన విఘాతములు జరుగగలవని ఆ శ్రీమన్నారాయణుడే 12 మంది ఆళ్వారులుగా ఈ భూమిపై జన్మించి ఎంతో భక్తి బోధనలు చేశారు. విష్ణు చిత్తులైన ఆళ్వార్లు విష్ణు భక్తిని విష్ణువుయొక్క గుణగణములను, గుణగానము చేయుచూ ఈ కలియుగములో ధర్మాచరణములకు పునర్జీవం పోశారు.
శ్రీ పూదత్తా ఆళ్వారులు :-
శ్రీ మహావిష్ణువు యొక్క కౌమోదికి అనబడే(శ్రీ మహావిష్ణువు యొక్క గద) అంశతో క్రీII పూII7వ శతాబ్దములోద్రవిడ దేశంలో మైలపోరిఅనే
గ్రామములో జన్మించారు.
శ్రీ మహావిష్ణువు యొక్క కౌమోదికి అనబడే(శ్రీ మహావిష్ణువు యొక్క గద) అంశతో క్రీII పూII7వ శతాబ్దములోద్రవిడ దేశంలో మైలపోరిఅనే
గ్రామములో జన్మించారు.
శ్రీ పొయ్ గై ఆళ్వారులు :-
శ్రీ మహావిష్ణువు యొక్క పాంచజన్యము యొక్క అంశతో క్రీIIపూII7వ శతాబ్దములో ద్రవిడ దేశంలో కాంచీపురం అనే గ్రామములో జన్మించారు.
శ్రీ మహావిష్ణువు యొక్క పాంచజన్యము యొక్క అంశతో క్రీIIపూII7వ శతాబ్దములో ద్రవిడ దేశంలో కాంచీపురం అనే గ్రామములో జన్మించారు.
శ్రీ పేయాళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క నందకము యొక్క అంశతో క్రీII పూII 7వ శతాబ్దములో ద్రవిడ దేశంలో మైలాపూరు అనే గ్రామములో జన్మించారు.
శ్రీ మహావిష్ణువు యొక్క నందకము యొక్క అంశతో క్రీII పూII 7వ శతాబ్దములో ద్రవిడ దేశంలో మైలాపూరు అనే గ్రామములో జన్మించారు.
శ్రీ పెరియాళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క గరుత్మంతుని అంశతో క్రీIIపూII 9 వ శతాబ్దములో ద్రవిడ దేశంలో శ్రీ వళ్ళి పుత్తూరు అనే గ్రామములో జన్మించారు.
శ్రీ మహావిష్ణువు యొక్క గరుత్మంతుని అంశతో క్రీIIపూII 9 వ శతాబ్దములో ద్రవిడ దేశంలో శ్రీ వళ్ళి పుత్తూరు అనే గ్రామములో జన్మించారు.
శ్రీ తిరుమళిశై ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనచక్రము యొక్కఅంశతో క్రీIIపూII 7వ శతాబ్దము లో ద్రవిడ దేశంలో తిరుమళిశై అనే గ్రామములో జన్మించారు.
శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనచక్రము యొక్కఅంశతో క్రీIIపూII 7వ శతాబ్దము లో ద్రవిడ దేశంలో తిరుమళిశై అనే గ్రామములో జన్మించారు.
శ్రీ కులశేఖర్ ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలము పై ఉన్నకౌస్తుభము అనే మణి యొక్క అంశతోక్రీII పూII8వ శతాబ్దములో ద్రవిడ దేశంలో తిరువంజికొళ్లం
అనే గ్రామములో జన్మించారు.
శ్రీ తిరుప్పాణి ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క హృదయము నందు గల శ్రీవత్సము అనే చిహ్నం యొక్క అంశతో క్రీIIపూII 8వ శతాబ్దములో ద్రవిడ దేశంలో ఉరైయూర్ అనే గ్రామములో జన్మించారు.
శ్రీ తొందరడి ప్పొడి ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క వనమాల అంశతో క్రీII పూII 8వ శతాబ్దములో ద్రవిడ దేశంలో తిరుమన్డన్ గుడి అనే గ్రామములో జన్మించారు.
శ్రీ తిరుమంగై ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క సంగీత వాయిద్యమైన సారంగి యొక్క అంశతో క్రీIIపూII 8వ శతాబ్దములో ద్రవిడ దేశంలో తిరుక్కురయలూర్ అనే గ్రామములో జన్మించారు.
శ్రీ నమ్మా ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క సేనాధిపతివారగు విష్వక్సేనుని యొక్క అంశతో క్రీII పూII 9వ శతాబ్దములో ద్రవిడ దేశంలో అళ్వార్ తిరునగరి అనే గ్రామములో జన్మించారు.
శ్రీ మధురకవి ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుడుని (వినత యొక్క కుమారుడైన వైనతేయుడు యొక్క) అంశతో క్రీIIపూII 9వ శతాబ్దములో ద్రవిడ దేశంలో తిరుకొల్లూరు అనే గ్రామములో జన్మించారు.
ఆండాళ్(గోదాదేవి):-
శ్రీ మహావిష్ణువు గారి సతీమణి అగు భూదేవి యొక్క అంశతో క్రీII పూII 9వ శతాబ్దములోద్రవిడదేశంలో శ్రీ వళ్ళిపుత్తూర్ అనే గ్రామములో జన్మించారు.
పై విధముగా 12గురు ఆళ్వార్లు విష్ణుఅంశసంభూతులుగా విష్ణు భక్తిని, 64 మంది నాయనార్లు శైవ భక్తికి శివాంశ సంభూతులుగా, ఎనమండు గురు మధ్వాచార్యులు ఈ కలియుగం లో మానవజాతి సముద్దరణకు మానవజాతి మనుగడకు భంగం కలుగకుండా కాపాడుటకు మరియు మానవజాతి ఉద్దరణకు కలిపురుషుని ప్రభావమునకు ఈ జాతి బలికాకూడదని అమాయకులను భగవద్భక్తులను ఉద్దరించుటకు ఈభూమిపై జన్మించినారు .
(ఆళ్వార్లు
(ఆళ్వార్లు
వైష్ణవ దేవాలయాలలో మనం ఆళ్వార్లు ని దర్శించుకుంటాం. ఆళ్వార్ అంటే నిమగ్నమై ఉన్నవాడు అని అర్ధం. తాము నమ్ముకున్న విధానంపట్ల అచంచల విశ్వాసాన్ని, భక్తిని కలిగి ఉన్నారని అర్ధం. ఆ శ్రీమన్నారాయణుని పట్ల భక్తిని పెంచుకున్నారు. ఆ భక్తిభావం కలిగిన అనంతరం వేరే భావాన్ని మదిలోకి రానివన్నంత గాఢంగా విశ్వాసాన్ని పెంచుకున్నారు. అందుకే భగవంతునికి అంత చేరువ కాగలిగారు. ప్రస్తుతం 12మంది ఆళ్వార్లు లేని వైష్ణవాలయం ఉండదంటే అతిశయోక్తి కాదు.వీరు ఉన్నపుడే ఆ ఆలయానికి పూర్ణత్వం సిద్ధిస్తుందని సాక్షాత్తూ ఆ శ్రీమన్నారయణుడే వీరిని స్వయముగా అనుగ్రహించడం ఇక్కడ విశేషం. అంతగా స్వామి ధ్యానంలో పరవశులైనారు వీరు.
వీరంతా శ్రీమన్నారయణుడికి సంబంధించిన ఆయుధాలు, ఆభరణాల అంశతో జన్మించారని కూడా అంటారు. దాని గురించి తెలుసుకుందాం.
భూతం సరశ్చ మహాదాహ్వాయ భట్టనాధ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్
భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్సరాంకుశ మునిం ప్రణతోస్మినిత్యం
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్
భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్సరాంకుశ మునిం ప్రణతోస్మినిత్యం
భూతయోగి - పూదత్తాళ్వార్ - కౌమోదకి అనే గద
సరోయోగి - పోయిగయాళ్వార్ - పాంచజన్యం అనే శంఖం
మహాయోగి - పేయాళ్వార్ - నందకం ఖడ్గం
భట్టనాధుడు - పెరియాళ్వార్ - గరుడుడు
ఆండాల్ - గోదాదేవి - లక్ష్మీదేవి అంశ
భక్తిసారయోగి - తిరుమళిసైయాళ్వార్ - సుదర్శన చక్రం అంశ
కులశేఖరాళ్వార్ - కౌస్తుభమణి అంశ
మునివాహనులు - తిరుప్పాణాళ్వార్ - శ్రీవత్సలాంచన అంశ
భక్తాంఘ్రిరేణువు - తొండరడిప్పొడియాళ్వార్ - వైయజంతి అను పూమాల అంశ
పరకాలయోగి - తిరుమంగైయాళ్వార్ - శారంగం అను ధనస్సు
మధురకవి ఆళ్వార్ - కుముదాంశ
శఠకోపముని - నమ్మాళ్వార్ - విశ్వక్సేనుని అంశ

ఈ వరుస క్రమముని ఒక్కోరు ఒక్కో విధంగా చెప్తారు. వీరంతా దాదాపుగా దక్షిణదేశానికి చెందినవారు. ఇక, వీరిలో నలుగురేమో పల్లవ రాజ్యానికి, ముగ్గురేమో చోళదేశానికి, ఒకరేమో కేరళ కి చెందినవారుకాగా, మరో నలుగురేమో పాండ్యదేశానికి చెందినవారు. కులమతాలకు అతీతంగా వీరిలో అందరూ ఉన్నారు. ముందు చెప్పిన విధంగా ఈ 12మందిలో ఒకరు దేశాన్నేలే రాజు కాగా, మరొకరు చోరవృత్తి చేసే వారు కూడా ఉన్నారు. ఆళ్వార్లు అందరూ మంచి కవులే.
ఇక ఆండాల్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆమె సాక్షాత్తూ శ్రీరంగడి పత్నిగా ఆయన హృదయంలోనే ప్రతిష్టితురాలైన గొప్ప భక్తురాలు. తిరుప్పావై ఈమె వ్రాసినదే. ఆమె తండ్రి పెరాయాళ్వార్ విష్ణుచిత్తుడిగా పేరుపొందాడు.)