కనకాభిషేకము Kanakabhisekamu

9కాని 11కాని బంగారు పూలు, తులసి దళాలు, గంగనీరు, రామేశ్వరం బావులలో నీరు, 4వ తరం ఇంటి పెద్దవారిని కూర్చొన పెట్టి వెండి చిల్లుల పళ్ళెములో తులసి దళములు, బంగారుపూలు పెట్టి బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతుంటే ఈ నీటితో అభిషేకము చేయుదురు. మనుమడు తన కొడుకును ఎత్తుకుని ముందుగా ముదిమనవ సంతానముచేత అభిషేకము చేయించుతారు. మిగిలిన అందరు ఒకరి తరువాత ఒకరు అభిషేకము చేయించుతారు. బంగారపు నిచ్చెన, వెండివి కఱ్ఱ, గొడుగు, పాదరక్షలు, పీట, ధనము, చెంబు, గంధపు చెక్క తులసిదళము, ఆవుదూడ, ఈ దశదానములు 4వ తరం ఇంటి పెద్ద ముదిమనవ సంతానమును పట్టుకుని 10 మంది బ్రాహ్మణులకు దానము ఇవ్వవలెను. ముదిమనవ సంతానము చేత ఇంటి పెద్దలకు బట్టలు పెట్టించవలెను.