Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

నైవేద్యం Offerings

నైవేద్యం

మనం సకలదేవతలను పూజిస్తూంటాం. ఇష్టదైవాలను ఎంచుకోడం అనేది వారివారి నమ్మకాలు, అనుభవాల మీద ఆధారపడిఉంటుంది. అమ్మవారు / అయ్యవారికి చేయవలసిన అష్టోత్తర సహస్రనామములు, షోడసోపచార పూజల తర్వాత, ఇష్టదైవాలకు అవసరనైవేద్యం, మహానైవేద్యం, తాంబూలం, హారతి (నీరాజనం), మంత్రపుషం, ఫలశృతి, తీర్ధస్వీకారం అనంతరం పూజ పరిపూర్ణం అవుతుంది.
తూర్పు లేదా ఉత్తరముఖముగా కూర్చొని పూజ చేయాలి. మనకు ఎదురుగా దేవతామూర్తులు ఉండాలి అంటే దక్షిణ లేదా పశ్చిమ ముఖముగా దేవతామూర్తులు ఉండాలి. పూజకి కూర్చొనేముందు ఎవరైనసరే కుంకుమ లేక విభూది లేదా తిలకము కాని పెట్టుకోవాలి. ( ఇప్పటికాలంలో పెళ్ళి ఐన ఆడువారు కూడా నల్లబొట్టు పెడ్తున్నారు, దయచేసి పెళ్ళి ఐనవారు ఎట్టిపరిస్థితులలోనూ నలబొట్టు ధరించవద్దు. ) మన నిత్య పూజ అనంతరం దేవుడికి నైవేద్యం పెడ్తాము. ఎవరికి ఏ నైవేద్యం పెట్టాలో ఒక్కసారి చూద్దాం.
వినాయకుడు : బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడు కాయలు నైవెద్యము శ్వేత అక్షతలతో (తెల్లని అక్షతలు) పూజ చేయాలి
ఏడుకొండల వెంకన్న : వడపప్పు, పానకం నైవేద్యము మెడలో తులసిమాల అలంకరించాలి
ఆంజనేయస్వామి : అప్పములు నైవేద్యముగాను, మెడలో వడమాల. సింధూరం, తమలపాకులతో పూజ చేయాలి
సూర్యుడు : మొక్క పెసలు, క్షీరాన్నం నైవేద్యం
లక్ష్మీదేవి : క్షీరాన్నం, తీపి పండ్లు నైవేద్యం. తామరపూలతో పూజింపాలి.
లలితాదేవి : క్షీరాన్నం, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.
సత్యనారాయణస్వామి : ఎర్రగోధుమనూకలో జీడిపప్పు, నెయ్యి కలిపిన నైవేద్యం
దుర్గామాత : మినపగారెలు
సంతోషిమాత : పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.
శ్రీకృష్ణుడు : అటుకులతో కూడిన తీపి పదార్ధాలు. వెన్న నైవేద్యం, తులసి దళములతో పూజింపాలి.
శివుడు : కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యం. మారేడు దళములతో పూజచేయాలి.
షిరిడి సాయిబాబా : గోధుమరొట్టెలు, పాలు

Popular Posts

Popular Posts

Ads