Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

ప్రార్ధనలు: Prayers :

ప్రార్ధనలు:
గణేశ ప్రార్ధన:
ఓం ఓం ఓంకార రూపం త్ర్యహమితి చపరం యత్స్వరూపం తురీయం
త్రైగుణ్యాతీతనీలం కలయతి మనసస్తేజ శ్రీహరేంద్రేణ సంగం
గంగంగంగం గణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వధనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే
భావం : శ్వేత వస్త్రధారి, సర్వవ్యాపి చంద్రకాంతితో శోభించువాడు, నాలుగు భుజములు గలవాడు, ప్రశాంత పదనంతో రంజిల్లువాడు అగు గణపతి దేవుని సర్వ విఘ్నములు తొలుగుటకై ధ్యానించుచున్నాను. 
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా||
భావం : వంకర తొండము కల్గి పెద్ద శరీరముతో కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించు దేవా! మేము చేయు సర్వ కార్యాలు ఆటంకము లేకుండగా పరిసమాప్తి కావాలని దీవించుము. 
అగజానన పద్మార్గం గజానాన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏక దంత ముపాస్మహే
సద్గురు ప్రార్ధన:
ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవేనమః||
భావం : గురువు బ్రహ్మ, విష్ణు, శివ లక్షణములు కలవాడు. అట్టి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులకు నమస్కరిస్తున్నాను.
సరస్వతి ప్రార్ధన:
ఓం యాకుందేందుతుషారహరధవళా యా శుభవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా
యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతిభి ర్దేవైస్సదా పూజితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహ
ఋషి వందనము:
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం|
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం||
భావం : శ్రీమన్నారాయణుని నుండి ఆరంభమై ఆదిగురువులైన ఋషి పరంపరలో భగవాన్‌ వేద శంకర భగవత్పాదుల నుండి బ్రహ్మ విదులైన గురుదేవుల వరకు గల గురుపరంపరకు సమస్సులు. 
వేదవ్యాస భగవానుడు:
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధ్యే వాసిష్ఠాయ నమోనమ:||
నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే
పుల్లార విన్దాయత పత్రనేత్ర|
యేన త్వయా భారత తైలపూర్ణ:
ప్రజ్వాలిలో జ్ఞానమయ: ప్రదీప:||
భావం : విశాల బుద్ధిగల వ్యాస మహర్షీ! వికసించిన పద్మ దళముల వంటి నేత్రములుగల వాడా! మహాభారతమనే తైలముచే నింపబడిన జ్ఞానదీపము నీచే వెలిగించబడింది. అట్టి నీకు నా నమస్కారములు. 
వాల్మీకి:
కూజంతం రామ రామేతి
మధురం మధురాక్షరం|
ఆరుహ్యా కవితాశాఖాం
వందే వాల్మీకి కోకిలం||
భావం : కవిత యనెడి చెట్టు కొమ్మ నుండి రామ రామ యనెడి మధుర గానం చేసిన వాల్మీకి కోకిలకు నమస్కారములు. 
శ్రీవిష్ణు మూర్తి:
శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాఙ్గమ్‌|
లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాధమ్‌||
భావం : శాంత స్వరూపుడు, శేషశయనుడు, పద్మనాభుడు, దేవదేవుడు, సృష్టికి ఆధారమైనవాడు, ఆకాశం వలె అనంతుడు, మేఘకాంతితో సుందర దేహము కలవాడు, లక్ష్మీదేవికి భర్త, పద్మములవంటి కన్నులవాడు, ధ్యానస్ధితిలో యోగుల హృదయంలో గోచరించువాడు,సంసార భయమును పారద్రోలువాడు, సర్వలోకాలకు ప్రభువుయైన విష్ణుమూర్తికి నమస్కారములు. 
పరమ శివుడు:
వందే శంభు ముమాపతిం సురగురుం
వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం
వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్నినయనం
వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం
వందే శివం శంకరం||
భావం : పార్వతీ పతియైన శంభుడు దేవతలకు గురువు, సృష్టికి మూల కారణం, గజ చర్మాంబర ధారి, పశుపతి నాధుడు, సూర్యచంద్రాగ్నులనే మూడు కన్నుల కలవాడు, ఆశ్రయించిన భక్తులకు వరదుడై, మంగళకరుడైన శివదేవునికి సహస్రకోటి నమస్కారములు. 
శ్రీరామచంద్రుడు:
శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్‌|
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి||
భావం : రఘువంశజుడు, దశరధ కుమారుడు, అప్రమేయుడు, జానకి నంధుడు, రఘువంశములో రత్నదీపము వంటివాడు, ఆజాను బాహుడు, పద్మసమయసుడు, రాక్షసులను సంహరించిన వాడు అగు శ్రీరామునికి నమస్కరించుచున్నాను. 
శ్రీకృష్ణుడు:
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్‌|
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌||
భావం : వసుదేవుని కుమారుడు, భగవంతుడు, కంస చాణూరులను వధించినవాడు, దేవకీ మాతకు దివ్యమైన ఆనందాన్ని కల్గించినవాడు అగు జగద్గురువైన శ్రీకృష్ణునికి నమస్కారములు. 
కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్ష:స్ధలే కౌస్తుభమ్‌
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణమ్‌|
సర్వాంగే హరి చందనం చ కలయన్‌ కంఠే చ ముక్తావళిమ్‌
గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణి:|| 
శ్రీ ఆంజనేయస్వామి:
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్‌|
రామాయణ మహామాలా రత్నం వందేనీలాత్మజమ్‌|
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా|
అజాడ్యం వాక్పటుత్వం చ హనూమత్స్మరణాద్భవేత్‌|| 
శ్రీ మహాలక్ష్మీ:
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం
శ్రీరంగ ధామేశ్వరీం,
దాసీభూత సమస్తదేవ వనితాం
లోకైక దీపాంకురాం|
శ్రీమన్మంద కటాక్షలబ్దవిభవత్‌
బ్రహ్మేంద్ర గంగాధరాం,
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం
వందే ముకుంద ప్రియాం|| 
సద్గురు ప్రార్ధన:
ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవేనమః 
శ్రీ సరస్వతీ:
సరస్వతీ సమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా||
భావం : వరములను ఇచ్చు తల్లిని, కోర్కెలను తీర్చుదానవు, ఓ సరస్వతీ మాతా నీకు నానమస్కారములు. నేను విద్యారంభము చేయుచున్నాను. సదానాకు సిద్ధిని ప్రసాదింపుము. 
హే హంస వాహినీ జ్ఞాన దాయినీ
అంబ! విమల మతిదే! అంబ! విమల మతిదే||
జగశిరమౌర బనాయే భారత్‌
బహు బల విక్రమదే ||అంబ||
సాహస శీల హృదయమే భరదే
జీవన త్యాగ తపోమయ కరదే
సంయమ సత్యస్నేహ కా వరదే
స్వాభిమాన భరదే ||అంబ||
లవకుశ ధ్రువ ప్రహ్లాద బనే హమ్‌
మానవతా కా త్రాస్‌ హరే హమ్‌
సీతా సావిత్రీ దుర్గా మా
ఫిర్‌ ఘుర్‌ఘుర్‌ భరదే ||అంబ|| 
శ్రీ దుర్గాదేవి:
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధకే|
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే|| 
శ్రీవెంకటేశ్వర స్వామి:
శ్రియ: కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినామ్‌,
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌|| 
శ్రీ సత్యనారాయణ స్వామి:
ధ్యాయేత్సత్యం గుణాతీతం, గుణత్రయ సమన్వితం
లోకనాధం త్రిలోకేశం, కౌస్తుభా భరణం హరిమ్‌|
పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం
గోవిందం గోకులానందం, బ్రహ్మాద్యైరభిపూజితమ్‌|| 
శ్రీనరసింహస్వామి:
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం|
నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌మృత్యుం నమామ్యహమ్‌|| 
కలికల్మషనాశనమంత్రం :
హరే రామ హరే రామ రామ రామ హరే హరే,
హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే|| 
భాగవతుల ప్రార్ధన:
ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుకశౌనక భీస్మదాల్భ్యాన్
రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్
పుణ్యానిమాన్ పరుమభాగవతాన్ స్మరామి 
శ్రీరామ ప్రార్ధన:
శ్రీరామం త్రిజగద్గురం సురవరం సీతామనోనాయకం
శ్యామంగం శశికోటి పూర్ణ వదనం చంచత్కలా కౌస్తుభం
సౌమ్యం సత్వ గుణోత్తమం సుసరయూ తీరే వసంతం ప్రభుం
త్రాతారం సకలార్ధ సిద్ది సహితం వందే రఘూణాంపతిం 
శ్రీ కృష్ణ ప్రార్ధన:
కృష్ణో రక్షతునోజగత్రయగురుః కృష్ణం నమస్యమ్యహం
కృష్ణేనామరశ్త్రవో వినిహతాః కృష్ణాయ తస్త్మైనమః
కృష్ణా దేవ సముత్ధితాం జగదిదం కృష్ణస్య దాసో స్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ! రక్షస్వమాం 
శ్రీ శివ కేశవుల ప్రార్ధన:
ఓం శివాయ విఘ్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విఘ్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః 

Popular Posts

Popular Posts

Ads