Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శుక్లాంబరధరం విష్ణుం Suklambaradharam visnum

శుక్లాంబరధరం విష్ణుం
శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే
శుక్ల – స్వచ్చమైన
అంబర – ఆకాశాన్ని
ధర్మ – ధరించిన
శశివర్ణం – చంద్రుని వంటి కాంతి కలిగిన
చతుర్భుజం – నాలుగు వేదాలను నాలుగు భుజములుగా కలిగినవాడు / చతుర్విధపురుషార్ధాలను ఇచ్చువాడు
ప్రసన్నవదనం – చిరునవ్వులొలికించి సిరివెన్నలలను చిందించు నగుమోము కలవాడు
విష్ణుం – సర్వవ్యాపకుడైన పరమాత్మ
సర్వ విఘ్నోపశాంతయే – సమస్త అడ్డంకులను శాంతింపచేయుటకు
ధ్యాయేత్ – ధ్యానం చేస్తున్నాను.
తెల్లటి వస్త్రాన్ని ధరించి, చంద్రుని వంటి కాంతి కలిగి, ధర్మార్ధ కామమోక్షములను నాలుగు శ్రుతులనే భుజాలు గా ధరించి, ప్రసన్న వదనం కలిగి అంతటా వ్యాపించి ఉన్న ధర్మ స్వరూపుడైన పరమాత్మను, అన్ని అడ్డంకులను తొలగించి శాంతి కలిగించమని చేసే దైవ ప్రార్ధన.
ఇది వినాయకుడి ప్రార్ధనగా మన అందరికి తెలుసు. విఘ్నశబ్దం ఉంది కనుక వినాయకుడి ప్రార్ధన అని, హిందూ మతానికే చెందినది అని అనుకుంటాము. కాని, అంతటా వ్యపించి ఉన్న పరమాత్మను ప్రార్ధించే శ్లోకంగా, అర్ధం తెలిసినవారు అంగీకరిస్తారు.
శుక్లాంబర ధారిణిగా సరస్వతీదేవిని తలచి ప్రార్ధించవచ్చు. గణేశుడు కూడా ఈ శ్లోకం ద్వార పూజలు అందుకుంటాడు. నిజానికి ఇది ఒక మహా మంత్రరాజం.
ఇది 32 బీజాక్షరాలు కలిగిన మహామంత్రం. ఇది పూర్ణ గాయత్రీ మంత్రంతో సమానం. పూర్ణగాయత్రి కి కూడ 32 అక్షరాలే. ఈ బీజాక్షరాలలో శబ్దశక్తి ఉంది. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని శ్రుతి. ఆ అద్వితీయమైన పరబ్రహ్మ అనుగ్రహప్రాప్తికై చేసే ఏకైక ప్రార్ధనా శ్లోకమిది.
ఏకో దేవః సర్వభూతేషు...అనే శ్రుత్యర్ధం తెలిస్తే, ఈ శ్లోకం మహా మంత్రమని తెలుస్తుంది. సమస్త విఘ్న నివారిణి ఐన ఈ శ్లోకాన్ని జపిస్తే ఎటువంటి ఆటంకాలు ఉండవు.

Popular Posts

Popular Posts

Ads