Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

పసుపు Yellow

పసుపు
పసుపు అనేది భారతీయ జీవన విధానంలో ఒక భాగంగా ఎప్పుడో మారింది. మనకు తెలిసో తెలియకో నిత్యం పసుపు లేనిదే మనకు చాలా పనులు కావు. యాంటీ బైటిక్ మందుగా మనకు పసుపు సుపరిచితమే. చిన్నప్పటి నుంచి దెబ్బ తగిలితే పసుపు రాయడం అనేది మనకు తెలిసిన విద్యే. ఇలాంటి పసుపుని కూడా వారి సొంతం చేసుకోవడానికి పాశ్చాత్యులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పసుపు గొప్పదనం, పాశ్చాత్యులకు పసుపు విజ్ఞానం సొంతమైందా అనే విషయాలు చూద్దాం.
1) ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ అనేది భారత ముత్తయిదువుల సౌభాగ్యవరం.
2) పసుపు కాళ్లకూ ముఖానికీ రాసుకోకుండా ఏ సుమంగళీ స్నానం చేసేవారు కారు.
3) అది కేవలం చర్మ సౌందర్యం కోసమే కాక,చర్మకాంతి, నునుపు, పగుళ్లు లేని పాదాలు, మొదలైన ఆరోగ్యదాయక పదార్థంగా వాడబడేది.
4) పసుపు కొమ్ములను దంచి, నిమ్మరసంలో మూడు రోజులు నానబెట్టి, బాగా ఎండబెట్టి, పొడి చేసి, స్వచ్ఛమైన కుంకుమ తయారు చేస్తారు. ఆ కుంకుమనే స్త్రీలు నుదుట మాంగల్య చిహ్నంగా ధరిస్తారు. పేరంటాళ్లకు పంచుతారు.
5) ఇంతే కాక ప్రతి భారతీయ గడపా పసుపు కుంకుమలతో శోభిల్లుతుంటుంది. ఇంటి ముందు మంగళకరంగా ఉండాలని పసుపునీళ్లు చల్లుతారు.
6) ఈ పసుపు కొమ్ములను కలశ పూజల్లో కూడా వాడతారు. వంటలలో పసుపు వాడకం భారతీయ ఆనవాయితీ.
7) పసుపు వాడకం కేవలం రంగు కోసమే కాక ఆరోగ్యదాయకం కూడా. గొంతు బొంగురు పోయినపుడు దగ్గు జలుబు తగ్గడానికి పాలల్లో పసుసు వేసి ఇస్తారు.
8) నీరు మరగబెట్టి పసుపు వేసి ఆవిరి పడితే ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మం భయటికి వస్తుంది.
9) పసుపును అద్దకపు రంగుగా కూడా వాడతారు. పసుపుతో తయారు చేసే ఔషధాలు ఎన్నో. అవి ఆయుర్వేద గ్రంథాలనిండా వివరించబడి ఉంది.
10) దెబ్బ తగిలితే పసుపు రాయడంలో దాని యాంటీసెప్టిక్ లక్షణాలను తెలియజేస్తోంది.
11) హిందూలో ప్రచురించిన వ్యాసం(25 ఏప్రిల్ 2005) లో అల్జీమర్స్ కు పసుపు వాడితే రోగం నయమవుతుందని కనుగొన్నారు. రోగనివారిణిగా కూడా చెప్పారు.
12) అందుకే పసుపు భారతీయ వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు కాబట్టి భారతీయుల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

Popular Posts

Popular Posts

Ads