Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

సుగుణ రూపనగుడి మహాలయ పక్షాలు లేదా పితృ పక్షాలు Suguna Roopanagudi Mahaalaya Pakshaalu Laedaa Pitr Pakshaalu

సుగుణ రూపనగుడి
మహాలయ పక్షాలు లేదా పితృ పక్షాలు
మహాభారతంలో దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గలోకం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఆకలి -  దప్పిక కలుగుతాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని దాన్ని తాకడంతోనే ఆశ్చర్యంగా ఆ పండు  బంగారపు ముద్దగా మారిపోయింది.
ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారి పోయింది. ఆ తరువాత
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ఆకాశవాణి ఇలా పలికింది ''కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది " అని చెప్పగానే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతా పితరులకు తర్పణాదులు వదిలి తిరిగి రమ్మన్నాడు.
ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణములు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికెళ్లాడు.
ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండి పోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే “ మహాలయపక్షము లేదా పితృ పక్షములు అని పేరు వచ్చింది. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.
అమావాస్య అను పేరుకు కూడా ఒక విశేషం ఉంది. అసలు దీనిపేరు మావస్యగా ఉండేది. మావస్య అనగా ప్రియురాలు లేదా ఆధీనురాలు అని అర్ధం.
పితృదేవతలు 7 గణములుగా ఉంటారు. వారికి ఒక పుత్రిక ఉంది. ఆమె పేరు “ అచ్చోద " . ఇలా ఉండగా పితృదేవతలు ఒక సరస్సును సృష్టిస్తారు. ఆ సరస్సుకు ఆమె పేరు పెడతారు. ఆమె ఒకనాడు ఆ సరస్సు దగ్గర తపస్సు చేసిన కారణంగా పితృదేవతలు ప్రత్యక్షమై వరం  కోరుకోమనగా ఆమె ఆ పితరులలో ఉన్న “ మావసుడు " అనే అతన్ని కామంతో కోరుకుంటుంది. దానితో ఆమె చేసిన అపరాధం వల్ల దేవత్వం పోతుంది. కానీ ఆ మావసుడు మాత్రం ఆమెను కోరుకోడు. అందువల్ల ఆమె మావసుడు దక్కనందువల్ల “ ఆమావస్య" గా అయింది.

వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి .

No comments:

Post a Comment

Popular Posts

Popular Posts

Ads