Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

అక్షయ తృతీయ Aksaya Trtiya

అక్షయ తృతీయ
అక్షయం అంటే క్షయము లేనిది. జీవితంలో అన్నింటినిఅక్షయం చేసే పర్వదినం కాబట్టి దీనికి అక్షయ తృతీయఅని పేరు వచ్చింది. వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియనాడు ఈ పండుగను జరుపుకొంటాము. ఈ పండుగగురించి, ఆచరించాల్సిన విధివిధానాలను గురించి భవిష్య,శివ పురాణాలలో వివరించారు.వైశాఖ శుద్ధ తదియ నాడుకృతయుగం, కార్తీక శుక్లనవమినాడు త్రేతాయుగం,భాద్రపద బహుళ త్రయోదశినాడు ద్వాపరయుగం,మాఘబహుళ అమావాస్యనాడు కలియుగంఆరంభమైనదని విష్ణు పురాణంచెబుతోంది. కృతయుగం ప్రారంభమైన రోజునఅక్షయతృతీయగా జరుపుకొంటారు. బదరినారాయణస్వామి ఆలయాన్ని ఈ రోజున తెరుస్తారు.ఉత్తర భారతంలో ఈ పండుగనాడు లక్ష్మీదేవి పూజచేస్తారు. అక్షయతృతీయ నాడు బంగారం కొనుగోలు చేసిఇంటికి తెచుకొంటే లక్ష్మీదేవి ఆయా గృహాల్లో స్థిరనివాసంఏర్పరచుకొంటుందని పలువురి నమ్మకం.

Popular Posts

Popular Posts

Ads