Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

సంక్రాంతి Samkraamti

సంక్రాంతి
సూర్యభగవానుడు దక్షిణాయనం (దేవతలకు రాత్రిసమయం) నుండి ఉత్తరాయణం (దేవతలకు పగలు) లో కిప్రవేశించే సమయం లో మనం సంక్రాంతి పండగనుజరుపుకొంటాము. సంక్రాంతి అనే సంస్కృత పదానికిఅర్దము శుభ సమయము.
ఆంగ్ల సంవత్సరం ప్రకారం మనకు వచ్చే మొదటి పండగ.మేము ఐతే ఈ పండగను పెద్దపండగ అనిపిలుస్తాము.
సంక్రాంతి నాల్గురోజుల పండగ. మొదటి రోజు భోగి.తెలవార్జామునే లేచి ఇంటి ముంగిట భోగి మంటలువేస్తారు. ఇంట్లో ఉన్నపాత / వాడని వస్తువులు,తాటాకులు బోగిమంటలో వేస్తారు. రైతులకు పంట చేతికివచ్చి ఇల్లు చేరుస్తున్న సమయంలో ఇంటిని శుభ్రం చేస్తూఇంట్లో ఉన్నచెత్త అంతా భోగి మంటల రూపం లో వేసిఇంటిని కొత్త ధాన్యానికి అనుగుణంగా మలుస్తారు.భోగిమంటలో కాల్చిన తేగలు ఎంత రుచిగా ఉంటాయిఅంటే మాటలలో చెప్పలేను.
దారిద్ర్యాన్ని నశింప చేస్తూ శ్రీ మహా లక్ష్మి ని మన ఇంటికిఆహ్వానిస్తున్నమనే ఈ భోగి యొక్క అర్ధము.
ఈ నాల్గు రోజులు పార్వతిదేవిని గొబ్బెమ్మ రూపంలోపూజిస్తారు. కనుమ పక్కరోజుగొబ్బెమ్మను దగర్లో ఉన్న నదిలోకాని చెరువులో కాని, ఏ వసతిలేకపోతే పెరటిలోని బావిలో కానివాలాడిస్తారు ( నిమర్జనంచేయడం).
రెండవ రోజు సంక్రాంతి...సంక్రాంతి అనగానే మనకుముందుగ గుర్తు వచ్చేది ముఖ్యంగా ....
కొత్త అల్లుళ్ళు ,తెలవార్జామున వచ్చేజంగమ దేవరులు (సంక్రాంతి నెలలోమాత్రమే వస్తారు) , హరిదాసులు,బుడబుక్కలవాడు, గంగిరెద్దువాళ్లు ,కోడిపందేలు, గాలిపటాలు, పిండివంటలుముఖ్యంగా అరిసెలు,మణుగుపూలు(జంతికలు ).
రైతులకు పంట చేతికి వచ్చి ధాన్యానిఇంటికి చేర్చే వేళ అందరు సంతోషం తోపొద్దునే లేచి వాకిట్లో కళ్ళాపి చల్లి రంగులముగ్గుల మద్యలో గొబ్బెమ్మలను(పార్వతిదేవి) పెట్టి, తలంటు స్నానాలుచేసి, పాలు పొంగించి కొత్త ధాన్యం తోపొంగలి వండి, దేవుడికి నైవేద్యం పెడతారు. సంక్రాంతిరోజు బొమ్మలకొలువు పెట్టే సంప్రదాయం కూడాచాలామందికి ఉంది.
మూడవరోజు కనుమ. రైతులు తమ దగ్గర ఉన్నపశుసంపదకు (ఆవులు, ఎద్దులు ....) పూజ చేస్తారు. అవి తమధాన్య సంపాదనకు ఎంతగానో సహాయం చేసినందుకువాటిని గౌరవిస్తూ పూజిస్తారు. నాల్గవరోజు ముక్కనుమగాజరుపుతారు.
కనుమ రోజు ఎటువంటి సందర్భం లోను ప్రయాణాలుచేయరు.

Popular Posts

Popular Posts

Ads