Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

బాబా మహాసమాధి చెందినరోజు,విజయదశమి. Baba mahasamadhi cendinaroju , Vijayadashami .

బాబా మహాసమాధి చెందినరోజు,విజయదశమి.
సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా మహాసమాధి చెందిన రోజు.
1918, రామచంద్ర పాటిల్ అనే భక్తుడు తన జబ్బు తగ్గాలని భయం తో బాబాను ప్రార్దించాడు.బాబా అతనికి కలలో కనపడి బయపడాల్సింది నువ్వు కాదు తాత్యా అని చెప్పారు.(బాబా ను ఎప్పుడు మామా, మామా అని పిల్చే వాడు తాత్యా). తాత్యా విజయదశమి రోజున మరణించాల్సి వుండి కాని నేను అది జరగనివ్వను అని రామచంద్రపటిల్ కు బాబా చెప్పారు.
నవరాత్రులు రానే వచ్చాయి. తాత్యా కు భయంకరమైన జబ్బు చేసి మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. బాబా విభూది వలన అతను కోలుకొన్నాడు కానీ బాబాఅక్టోబర్15,1918 విజయదశమి రోజున తాత్యా కి బదులు తాను మన అందరిని వదిలి మహాసమాధిని పొందారు.అక్టోబర్ 17, న బాబా దేహాని సమాధి చేసి దాని మీద వారి పటం వుంచారు.
సాయి గురుప్రసాదం గా భావించిన ఇటుక ను బాబా సమాధి లో తల కింద వుంచారు. అలాగే బాబా దగ్గర ఎపుడు ఒక మూట వుండేది,అందులో పాత కఫ్ని,టోపీ వుండేవి. అవి కూడా బాబా సమాధి లో ఉంచారు.
బయాజామామి బాబా ని కొడుకు తాత్యని ఒకేలా చూసింది,కాదు కాదు సాయి నే ఎక్కువ చూచుకొన్నది. అందుకనే బాబా తాత్యని తమ మరొక రూపంగా ప్రేమించారు.
ఒకే ఆత్మ రెండు దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణం లో కూడా వేరుకాకుడదు అని బాబా మొదట తలచారు కానీ తాత్యా కుటుంబా ని తలచి తన సంకల్పాన్ని మరల మార్చుకొన్నారు.
కన్నతల్లి కన్నా తమ భక్తులను ఎక్కువగా కనిపెట్టుకొని వుంటారు బాబా.
జై సాయినాథ్ మహారాజ్

Popular Posts

Popular Posts

Ads