Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

దశర చివరిరోజు ..విజయదశమి Dasara last vijayadasami dasara chivari roju ..vijayadaShami

దశర చివరిరోజు ..విజయదశమి
అమ్మవారు మహిషాసురుడుని సంహరించి, దుష్ట సంహారం చేసి సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజు [దశమి తిధి నాడు] పండగ జరుపుకొంటాం. కాబట్టి విజయదశమి గా పిల్చుకొంటున్నాం.
ఈ విజయదశమి ని మన దేశం లో ఉత్తర దిక్కున ఉన్నవారు ఈ రోజున , రాముడు రావణుడి ఫై విజయం సాదించి దుష్ట సంహారం చేసి, సీతమ్మని తిరిగి అయోధ్యకు తీస్కొని వెళ్ళిన సందర్భానికి గుర్తుగా రావణుడి బొమ్మను కూడా దగ్దం చేసి పండుగను జరుపుకొంటారు.
12ఏళ్ళు వనవాసం, 1 ఏడు అఙ్ఞాతవాస కాలం లో పాండవులు తమ మంత్రోపేతమైన ఆయుధాలను జమ్మి వృక్షం ఫై వుంచి,తిరిగి అఙ్ఞాతవాసం తర్వాత జమ్మి వృక్షమునకు పూజ చేసి ఆయుధాలను ధరించారు.కాబట్టి చాలా ప్రాంతాలలో ఈ రోజున "ఆయుధపూజ" ని చేస్తారు. కొన్ని ప్రాంతాలలో జమ్మి ఆకులను కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొంటారు.

Popular Posts

Popular Posts

Ads