Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

హరివాసరం ఏకాదశి Harivasaram Ekadasi

ఏ పని చేయాలన్నా, ఏకాదశి తిది చూడటం మనకిఅలవాటు. కోర్కెలను ఫలింప చేసుకోడానికి, దైవారాధనకుచాల ముక్యమైన తిధి. ప్రతీ మాసం లో రెండు పక్షాలు (15 రోజులని పక్షం అంటారు ) ఉంటాయి. ప్రతీ పక్షంలో వచ్చేపదకొండవ తిధి ఏకాదశి. సంవత్సరం పొడవునాసాధారణంగా 24 ఏకాదశులు వస్తుంటాయి. అధికమాసంఐతే ఒక ఏకాదశి ఎక్కువ.


ఈ తిధి లో హరినామస్మరణ చేయడం ముఖ్యం. హరికిఇష్టమైన తిధి కనుకనే, హరివాసరం ఏకాదశిఅంటారు.ఈరోజు నియమ నిష్టలతో కూడిన ఉపవాసంచేయాలి. వివిధ రకాల ఏకాదశులు, వాటికి గల పేర్లు, చేసేవ్రతాలు, వాటివలన కలిగే ఫలితాలను గురించి నారదపురాణం పద్యభాగం నాల్గవ పాదం 120 వ అధ్యాయంలో చెప్పబడినది. ఆషాడ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినిప్రధమ ఏకాదశి అని, తొలి ఏకాదశి అని అంటాము. సతీసక్కుబాయి ముక్తి ని పొందిన రోజుగా చెప్పుకొంటాము.

తొలిఏకాదశి నుండి సూర్యుడు దక్షిణం వైపు ఉన్నట్లుకనిపిస్తాడు. మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని మోక్షఏకాదశి అని / వైకుంఠ ఏకాదశి అని / ముక్కోటి ఏకాదశిఅని అంటారు. ఏకాదశుల్లో చాల పవిత్రమైనవి ఇవి. ఈసమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈఏకాదశులల్లో సూర్యుని సంచారానికి సంబంధించినఅంశాలు ఇమిడి ఉంటాయి. 

ఏకాదశి / ఏకాదశి వ్రతాలు ప్రధానంగా హరిపూజ,దానధర్మాలు, ఇంద్రియ నిగ్రహానికి ప్రాధాన్యం ఇచ్చేవిగాఉంటాయి.
ఆషాడం నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు నాలుగునెలలపాటు చాతుర్మాస వ్రతం ఆచరిస్తారు. అలాగే కార్తీకశుక్ల ద్వాదశి వరకు గోపద్మ వ్రతం చేస్తారు. ఇంటి పరిసరాలపరిశుభ్రతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఈ వ్రతం లోకనిపిస్తుంది. పశువుల కొట్టాలు శుభ్ర పరిచి, పిండితోముగ్గులు పద్మాలను వేసి పశువులను పూజచేస్తారు.పశువులు కనుమరుగు అవుతున్న ఈ తరుణంలోచాతుర్మాస వ్రతం ఆచరించిన సరిపోతుంది.


ఏకాదశి సమయాలలో నాలుగు నెలల పాటు విష్ణువుపాల కడలిపై శయనిస్తాడు. అందుకే శయన ఏకాదశి అనేపేరు కూడా ఉంది. తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు మేల్కొంటాడు. కాబట్టి దానిని ఉత్ధానఏకాదశి అంటారు. ఏకాదశి అవతరణ వరాహ పురాణం30వ అధ్యాయంలో వివరించినట్లు తెలుస్తున్నది.

Popular Posts

Popular Posts

Ads