Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రావణమాసం / మంగళగౌరీ వ్రతం Sravanamasam / mangalagauri wary Sraavanamaasam / Mamgalagauree Vratam

శ్రావణమాసం / మంగళగౌరీ వ్రతం

శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది, "వరలక్ష్మి వ్రతం " మరియు "మంగళ గౌరీ వ్రతం".
ముందుగా మంగళ గౌరీ వ్రతం గురించి తెల్సుకొందాం.పార్వతి దేవి కి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసం లోవచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి ఐనపార్వతీదేవి ని పూజించాలి.
ముందుగా,ఒకశుభ్రమైనపీట నుపసుపుకుంకుములతో అలంకరించి, దాని పైన ఒక ఎండు కొబ్బరిచిప్ప లో పసుపుతో చేసిన గౌరి దేవిని అలకరించాలి.పసుపు వినాయకుడిని కూడా అలకరించాలి. ముందుగావినాయక పూజ చేయాలి. కలశం పెట్టె సంప్రదాయంఉన్నవారు కలశం పెట్టి, కలశ పూజ చేయాలి.వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి /ఫణి గౌరి దేవి అష్టోత్రం చదివి , అమ్మవారి ముందు 5ముడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు
, 5 పిండి దీపారాధనలు(బియ్యంపిండి, చక్కర/బెల్లంమిశ్రమం తో చేసిన దీపాలు )పెట్టి పూజించాలి. పూజ ఐనతర్వాత అమ్మణ్ణి కి నైవేద్యంపెట్టి, హారతి ఇచ్చి, అమ్మవారిదగ్గర పూజలో పెట్టిన ఒకతోరం మనం కట్టుకోవాలి. పిండి దీపారాధనలుకూడా....ఒకటి అమ్మణ్ణి కి, ఒకటి మనకి (పూజచేసినవారు), మిగిలిన 3 ముత్తైదువలకు తాంబూలం తోపాటు ఇవ్వాలి. వ్రతం ఐన పక్కరోజు అమ్మణ్ణి కి హారతిఇచ్చి, నైవేద్యం పెట్టి " యధా స్థానం ప్రవేశాయామి,పూజార్ధం పునరాగామనాయచ " అని అమ్మణ్ణి కిఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్లి,మళ్లీ పూజ కి మమ్మల్ని అనుగ్రహించు అని అర్ధం.
అంతటి తో ఒక వారం వ్రతం సంపూర్ణం అవుతుంది. ఈవిధంగానే మిగిలిన ౩ వారాలు వ్రతాన్ని కొనసాగించాలి.
ఈ దీపాల దగ్గర రెండు పద్దతులు ఉన్నాయి. (1) కొందరు4 వారాలు, అమ్మణ్ణి దగ్గర 5 పిండి దీపారాధనలు ఉంచిపూజిస్తారు. (2)మొదటి సంవత్సరం ఐదు పిండిదీపారాధనలు మొదలై ప్రతీ ఏడు పెరుగుతూ అంటేరెండవ సంవత్సరం పది తాంబూలాలు అలా చివరికి ఇరవైఐదు పిండి దీపారాధనలు ముగుస్తుంది. చివరి సంవత్సరంఐన తర్వాత ఒక కొత్త పెళ్ళికూతురికి వాయనం ఇవ్వాలి.
వ్రత ఉద్యాపన :
ఈ వ్రతాన్ని పెళ్ళీ ఐన సంవత్సరం నుండి ప్రారంభించి 5సంవత్సరాలు చేయాలి, 5వ సంవత్సరం శ్రావణ మంగలవారం పగటివేళ మంగళగౌరిని యధావిధిగా పూజించాలి. దంపతులిద్దరు ఉపవాసం ఆచరించాలి. ఆ రోజున కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఇత్తడి గిన్నెలో 33జతల అరిసెలు పెట్టి, వాటి మీడ పసుపు గుడ్డకప్పి, పైన చీర, రవికె, తాంబూలం, నోముసూత్రాలు, మెట్టెలు, నల్లపూసలు ఉంచి బొట్టు పెట్టి ఇవ్వాలి.

No comments:

Post a Comment

Popular Posts

Popular Posts

Ads