Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీ కనకధారా స్తవము: Sri kanakadhara glorification :

శ్రీ కనకధారా స్తవము:
వన్దే వన్దారుమన్దారమిందిరానందకందలమ్
అమన్దానంద సందోహ బన్ధురమ్ సిన్ధురాననమ్
అజ్ఞం హరే: పులకభూషణమాశ్రయన్తీ
భృంగాజ్గనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతా ఖిలవిభూతి రపాజ్గలీలా!
మాఙ్గల్వదాస్తు మమ మంఙ్గళదేవతాయా:
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారే:
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలాదృశోర్మధు కరీవ మహొత్పలేయా
సామేశ్రియం దిశతు సాగరసమ్భవాయా:
విశ్వామరేన్ద్ర పదవిభ్రమదానదక్ష
మానన్ద హేతు రధికం మురవిద్విషోపి
ఈషన్ని ఫీదతు మయి క్షణమీ క్షణార్థ
మిన్దీవరోదర సహొదర మిన్దిరాయా:
ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్ద
మానన్దకన్ద మనిమేష, మనఙ్గతస్త్రమ్
ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రమ్
భూత్యైభవేన్మమ భుజఙ్గశయాఙ్గనాయా: 
కాలామ్బుదాళి లలితోరసికైటభారే
ర్ధారాధరే స్ఫురతి యాతటి దఙ్గనేవ
మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తి
ర్భద్రాణి మే దిశతు భార్గవనన్దనాయా:
బాహ్యన్తరే మురజిత: శ్రితకౌస్తుభేయా
హారావళీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కళ్యాణ మహవతు మే కమలాలయాయా: 
ప్రాప్తం పదం ప్రథమత: ఖలు యత్ప్రభావాత్
మాఙ్గల్యభాజి మధుమాధిని మన్మధేన
మయ్యాపతే త్తదిహ మన్దరమీక్షణార్థం
మన్దాలసంచ మకరాలయకన్యకాయా:
దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారా
మస్మిన్న కిఞ్చనవిహజ్గశిశౌ విషణ్ణే
దుష్కర్మధర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనామ్బువాహ: 
ఇష్టా విశిష్టమతయోపి నరా యయాదయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభన్తే
దృష్టి: ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్టమమ పుష్కరవిష్టరాయా:
గీర్దేవతేతి గరుఢధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి |
సృష్టిస్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్మై నమస్త్రి భువనైక గురోస్తరుణ్యై || 
శ్రుత్యై నమోస్తు శుభకర్మపల ప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యైనమోస్తు శతపత్రని కేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై
నమోస్తు నాళీకనిభావనాయై
నమోస్తు గుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తుసోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై 
నమోస్తు హేమామ్బుజ పీఠికాయై
నమోస్తు భూమణ్డల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్జ్గా యుధ వల్లభాయై
నమోస్తు దేవ్యై భృగు నన్దనాయై
నమోస్తు విష్ణో రురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యైకమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై 
నమోస్తు కాన్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువనప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నన్దాత్మజ వల్లభాయై
సంపత్కరాణి సకలేన్ద్రియ నన్దనాని
సామ్రాజ్య దాననిరతాని సరోరుహాక్షి
త్వద్వన్దనాని దురితాహరణోద్యతాని
మామేవమాత రనిశం కలయస్తు మాన్యే 
యత్కటాక్ష సముపాసనావిధి:
సేవకస్య సకలార్థ సంపద:
సంతనోతి, వచాఙ్గమానసై
స్త్వాం మురారి హృదయేశ్వరీం భజే
సరసిజనయనే సరోజహస్తే
ధవళశతమాంశుక గంధమాల్య శోభే
భగవతి హరి వల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ 
దిగ్ఘస్తిభి: కనకకుమ్భ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమల చారుజలప్లుతాజ్గీమ్
ప్రాతర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథగృహిణీ మమృతాబ్దిపుత్రీమ్
కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణా పూరతరఙ్గితై రపాఙ్గే:
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయా: 
స్తువన్తి యేస్తుతిభి రమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతరభాగ్యభాజినో
భవన్తితే భువి బుధభావితాశయా:
బిల్వాటవీమధ్య లసత్సరోజే
సహస్రపత్రే సుఖసన్ని విష్టాం
అష్టాపదామ్భోరుహ పాణిపద్మాం
సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ 
కమలాసన పాణినా లలాటే
లిజికితామక్షరజఙ్త్కీ మస్య జంతో:
పరిమార్జయ మాత రంఘ్రిణా తే
ధనికద్వారానివాసదు:ఖదోగ్ద్రిమ్
అంభోరుహల జన్మగృహం భవత్యా
వక్షస్థలం భర్తగృహం మురారే:
కారుణ్యత: కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృధయారవిన్దమ్ 
సువర్ణధారాస్తోత్రం చ్ఛంకరాచార్య నిర్మితమ్
త్రిసంధ్యం య: పఠెన్నిత్యం స కుబేరసమోభవే 
కనకధారాస్తవ ప్రాశస్త్యము:
శ్రీ జగద్గురువులు శంకరాచార్యులు భిక్షాటన చేయుచు ఒక ఇంటి ముంగిట నిలిచిరి. ఆ గృహిణి కడు పేదరాలు, జగద్గురువును రిక్త హస్తములతో పంపుటకు మిక్కిలి బాధపడి ఆ పేదరాలు ఇంటిలో గల ఒక ఉసిరి కాయను భిక్షాపాత్రలో భక్తితో వేసినది. ఆచార్యుల వారు ఆమె పరిస్థితిని దివ్య దృష్టితో గమనించి మనస్సు కరుణా తరంగితముకాగా భక్తితో లక్ష్మీదేవిని శ్లోకములతో స్తుతించెను. లక్ష్మీదేవి సాక్షాత్కరించినది. శంకరుల వారు దేవితో ఆ పేదరాలిని కరుణింప ప్రార్థించిరి. గత జన్మమందలి దోషము వలన ఆమె నిరుపేదయైనది. అయినను శంకరునకు భక్తితో ఉసిరికాయ సమర్పించినందు వలన ఆ దోషము తొలగిపోగా లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలను కురిపించి ఆ గృహిణి యొక్క లేమిని తొలగించెను. అందుచే ఈ స్తోత్రమును కనకధారాస్తవముగ ప్రసిద్ధిగాంచెను. ఈ స్తోత్ర పఠనము సర్వసంపదలను కలిగించును.

Popular Posts

Popular Posts

Ads