Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

సుబ్రహ్మణ్యస్వామి Subrahmanyasvami Subrahmanyasvaami, Shanmukhudu,Kaarteekaeyudu,Vaelaayudhudu,kumaarasvaami

సుబ్రహ్మణ్యస్వామి
గౌరీశంకరులమంగళకర ప్రేమకు, అనుగ్రహానికి ఐక్య రూపంసుబ్రహ్మణ్యస్వామి. షణ్ముఖుడు, కార్తీకేయుడు,వేలాయుధుడు, కుమారస్వామి గా పేరు గడించిన స్వామికారణజన్ముడు. తారకాసురుడు, సురావణుడుమరికొందరు రాక్షసులు ప్రజలను, దేవతలను హింసిస్తూఉండేవారు. ఈ అసురల బారి నుండి కాపాడమనిబ్రహ్మను కోరగా, శివ పార్వతులకు జన్మించిన పుత్రుడువారిని వధిస్తాడని చెప్పాడు. ఆ రకంగా పార్వతిపరమేశ్వరుల అనుగ్రహం తో కుమారస్వామి పుట్టుకవిలక్షణమైనది.
శివాంశతో జన్మించిన సుబ్రహ్మణ్యస్వామి గంగాదేవిగర్భంలో పెరుగుతాడు.గంగాదేవి ఆ పుత్రుని భారంమోయలేక రెల్లు పొదల్లోకి జారవిడుస్తుంది. అప్పుడుకృత్తికా దేవతలు ఆరుగురు తమ స్తన్యమిచ్చి పెంచుతారు.రెల్లు పొదల్లో పెరిగినందువల్ల శరవణుడు అని, కృత్తికాదేవతలు పెంచినందు వల్ల కార్తికేయుడని పేరు వచ్చినదిఅని పురాణాలు చెబుతున్నాయి. ఆరు ముఖాలుకలిగినందు వల్లన షణ్ముఖుడు అని అంటారు. నెమలివాహనం కలిగిన స్వామి గణేశునికి సోదరుడు. ఆరుముఖాలలో ఐదు పంచేంద్రియాలకు, ఒకటి మనసుకుప్రతీక.
స్వామి అనే నామధేయం సుబ్రహ్మణ్య స్వామి కి మాత్రమేసొంతం. సేనాపతిగా సకల దేవగణాల చేత పూజలుఅందుకొనే సుబ్రహ్మణ్యుని అనుగ్రహం పొందితేగౌరిశంకరుల కటాక్షం లభిస్తుందని ప్రతీతి.తారాకాసురుడిని సంహరించిన కుమార స్వామి మార్గశిరమాసం శుక్లపక్ష షష్టినాడు జన్మించాడు. ఆరు ముఖాలు,పన్నెండు చేతులు సూర్య తేజస్సుతో జన్మించినషణ్ముఖుని ఆరాధించడం వలన సమస్తదోషాలు తొలగి,శుభాలు కల్గుతాయని భక్తుల నమ్మకం. ఆషాడమాస శుక్లపక్ష పంచమి, షష్టిని పర్వదినాలుగా జరుపుకొంటారు. శుక్లపక్ష పంచమిని స్కంద పంచమని, షష్టిని కుమార షష్టి అనిభావించి భక్తులు ఆ రెండు రోజుల విశేష పూజలు చేస్తారు.
పంచమి నాడు ఉపవాసం ఉండి, షష్టి నాడుకుమారస్వామి ని పూజించినట్లైతే నాగ దోషాలుతొలగుతాయని, ఙ్ఞానం వృద్ధి కలుగుతుందని, కుజదోషాలుతొలగుతాయని, సంతానం కలుగుతుందని నమ్మకం.
హే స్వామినాధ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతి సుముఖ పంకజ పద్మబందో
శ్రీ శాది దేవగణాధిత పాదపద్మ
వల్లీ సనాధ మమదేహి కరావలంబం

No comments:

Post a Comment

Popular Posts

Popular Posts

Ads