రథోత్సవం తరువాత కృష్ణతీర్థం, మహోదధీతీర్థం, మార్కండేయతీర్థ, ఇంద్రద్యుమ్నతీర్థం, నరేంద్రతీర్థాలలో స్నానం చేయాలి. సంవత్సరంలో 62 ఉత్సవాలు, 3 యాత్రలు చేస్తారు. క్షేత్రానికి బ్రహ్మదేవుడు ఏకాదశనామాలు పెట్టాడు. చదివి పడుకుంటే దుఃస్వప్నం సుస్వప్నం అవుతుంది, భయంకర జాతకదోషాలుపోతాయి, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి, భక్తితో తలిస్తే ఏ కష్టాలుండవు.
1) ఉచ్చిష్ట జగన్నాథాయనమః 2) శ్రీ క్షేత్ర జగన్నాథాయనమః 3) శంఖ క్షేత్ర జగన్నాథాయనమః 4) పురుషోత్తమ క్షేత్ర జగన్నాథాయనమః 5) నీలాద్రి జగన్నాథాయనమః 6)ఓడ్యాణ పీఠ జగన్నాథాయనమః 7)మత్య వైకుంఠ జగన్నాథాయనమః 8)యవనికాతీర్థ జగన్నాథాయనమః 9) ఓం కుశస్థలి జగన్నాథాయనమః 10) పురీక్షేత్ర జగన్నాథాయనమః 11) శ్రీ జగన్నాథా జగన్నాథాయనమః
No comments:
Post a Comment