"అమ్మవారి నవరాత్రుల అలంకారాలు", దశర, శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు,నవదుర్గలు,
మొదటి రోజు .....పాడ్యమి...శైలపుత్రి
శైలపుత్రి దేవతను నవరాత్రి సందర్భంగా మొదటిరోజు పూజిస్తారు. వృషభవాహనారూఢయైన ఈ అమ్మవారు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలతో విరాజిల్లుతూ ఉంటుంది. అమ్మవారి దేవాలయం వారణాసిలోని మర్హియ ఘాట్ వద్ద ఉంది. మరో దేవాలయం హేదవతి గ్రామంలో ఉంది.
నవరాత్రి సందర్భంగా రెండో రోజున ఈ దేవాలయంలోని అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారు స్వేత వర్ణ దుస్తులను ధరించి భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మచర్య దీక్షలో అమ్మవారు ఉంటారు. వారణాసిలో మాత్రమే నవదుర్గలకు వేర్వేరుగా దేవాలయాలు ఉంటాయి. వారణాసిలోనే ఈ అమ్మవారి దేవాలయం కూడా ఉంది.
మూడవరోజు ....తదియ...చంద్రఘంట
ఈ అమ్మవారి శిరస్సులో ఉన్న చంద్రుడు ఘంటాకారంలో ఉండటం వల్ల ఈమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈమె శరీరము బంగారు కాంతితో ఉంటుంది. ఈ తన పది చేతులతో పది విభిన్న ఆయుధాలను కలిగి ఉంటుంది. ఈమె వాహనం సింహం. ఈమె గంట నుంచి వెలువడే బయంకర ధ్వనులు విన్నంతనే రాక్షసులు చనిపోతారు. ఈమెను విజయానికి ప్రతీకగా భావిస్తారు.
నాల్గవరోజు...చవితి... కూష్మాండ
కూష్మాండ మాతను నవరాత్రి దినోత్సవంలో భాగంగా నాలుగో రోజు పూజిస్తారు. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమెను అష్టభుజి దేవి అని కూడా పిలుస్తారు. ఈమెకు ఎనిమిది భుజాలు ఉండటం వల్ల ఈమెకు అష్టభుజి అని పేరు. ఈమె వాహనం సింహము. ఈ దేవిని పూజించటం వల్ల రోగములు, శోకములు దరి చేరవని భక్తులు నమ్ముతారు. వారణిసితో పాటు కాన్పూర్ లో కూడా ఈ అమ్మవారి దేవాలయం ఉంది.
ఐదవరోజు ...పంచమి...స్కందమాత
కుమారస్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని పిలిచే మురుగన్ మాత కాబట్టే ఈమెను స్కందమాత అని పిలుస్తారు. స్కందమాతను నవరాత్రుల్లో ఐదో రోజున కొలుస్తారు. ఈమె చతుర్భుజి. ఈమె ఒడిలో కుమారస్వామి ఉంటారు. స్కందమాతను పూజించడం వల్ల కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయని చెబుతారు. వారణాసిలోని అన్నపూర్ణదేవి దేవాలయం పక్కనే ఈ దేవాలయం ఉంటుంది.
ఆశ్వయుజ క`ష్ణ చతుర్దశి నాడు కాత్యాయని మహర్షి ఇంట కాత్యాయని మాత జన్మించిందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో కాత్యాయన మహర్షి పూజలను అందుకొని విజయదశమిరోజు మహిషాసురుడిని వధించిందని చెబుతారు. కాత్యాయని శరీర వర్ణము బంగారు వర్ణములో ఉంటుంది. ఈమెను సేవించినచో జన్మజన్మాంతర పాపములు నశించిపోతాయని చెబుతారు. వారణాసితో పాటు కొల్హాపూర్ లో అమ్మవారి దేవాలయం ఉంది.
కాళరాత్రి దుర్గ గాఢాందకారము వలె ఉంటుంది. తల పై కేశములు చెల్లాచెదురుగా ఉండి చూడటానికి భయంకరముగా ఉంటుంది. ఈమెకు మూడు నేత్రాలు ఉంటాయి. ఈమె వాహనము గార్థభము.
ఎనిమిదవరోజు...అష్టమి... మహాగౌరి
ఈమె చతుర్భుజ వాహిని, వృషభవాహనం. ఒక చేతిలో అభయముద్రను, మరొక చేతిలో త్రిశూలము కలిగి ఉంటుంది. ఒక చేతిలో డమరుకము, మరొక చేతిలో వరముద్రను కలిగి ఉంటుంది. పరమశివుడిని భర్తగా పొందడం కోసం తపస్సు చేయగా ఆమె శరీరం పూర్తిగా నల్లరంగు వలే మారుతుంది. అయితే శివుడు ఈమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన తర్వాత స్వయంగా గంగా నదినీళ్లతో ఆమె శరీరాన్ని తడుపుతాడు. అప్పుడు ఆమె దవళ వర్ణ కాంతిలో మెరిసిపోతుంది. వారణాసితో పాటు లుథియానాలో అమ్మవారి దేవాలయం ఉంది.
తొమ్మిదవరోజు..నవమి... సిద్ధిధాత్రి
సర్వవిధ సిద్ధులను ప్రసాధించు తల్లి కాబట్టి ఈమెను సిద్ధి దాత్రి అని అంటారు. ఈమె శివుడు శరీరంలో అర్థభాగంలో నిలచింది. ఈమె చతుర్భుజ, సింహవాహని. ఈమె కమలం పై ఆసీనురాలై ఉంటుంది. నిష్టతో ఈమెను ఆరాధించిన వారికి సకల సిద్ధులు కలుగుతాయని చెబుతారు. అందువల్లే నవరాత్రుల్లో చివరి రోజు ఈమ్మవారిని ఈ రూపంలో పూజిస్తారు. వారణాసితోపాటు దేవ్ పహరీ చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లోని సాత్నాతోపాటు సాగర్ లో కూడా ఈ దేవి దేవాలయం ఉంది.
పదవరోజు...దశమి....విజయదసమి

ఏడవరోజు..సప్తమి... కాళరత్రి
కాళరాత్రి దుర్గ గాఢాందకారము వలె ఉంటుంది. తల పై కేశములు చెల్లాచెదురుగా ఉండి చూడటానికి భయంకరముగా ఉంటుంది. ఈమెకు మూడు నేత్రాలు ఉంటాయి. ఈమె వాహనము గార్థభము.
ఈమె చూడటానికి భయంకరముగా ఉన్నా ఎల్లప్పుడూ శుభాలనే ప్రసాదించును అందువల్లే ఈమెను శుభంకరి అని పిలుస్తారు. ఈమె అనుగ్రహం వల్ల గ్రహ బాధలు తొలిగిపోతాయని చెబుతారు.