Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

కోజాగరి వ్రతం విధానం Kojagari wary Kojagari Vratam Vidhanam

పాలకడలిలో శేషశయ్యపై శయనించి ఉండే స్థితికారుడైన శ్రీమహావిష్ణువు పాదాల చెంత ఆసీనురాలై ఉండే శ్రీమహాలక్ష్మిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. సంపదలను, సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీలక్ష్మీదేవిని భావిస్తాం. ఆ తల్లికి అత్యంత ప్రియమైన వ్రతం, దారిద్ర్య వినాసక వ్రతం "కోజాగరి వ్రతం".
పూర్వం మహర్షులందరూ వాలిఖిల్య మహర్షిని దరిద్ర్యం తొలగిపోయి, లక్ష్మీ ప్రసన్నం లభించే వ్రతాన్ని వివరించమని కోరగా, వాలఖిల్య మహర్షి ఈ వ్రతమును వివరించినట్లు పూరాణ ఆధారం.
పూర్వం మగధదేశంలో "వలితుడు" అనే బ్రాహ్మణుడు నివసిస్తూండేవాడు. గొప్ప పండితుడు, భక్తుడు అయిన వలితుడు కటిక పేదవాడు. ఆయన భార్య "చండి" పరమ గయ్యాళి. తనకు బంగారం, పట్టు వస్త్రాలు కొన్నివలేదని వలితుడి మాట దిక్కరించి భర్తకు వ్యతిరేకంగా నడవసాగింది. (అంటే ఎడ్డం అంటే తెడ్డం అనే రకం). వలితుడికి ఇది బాగ క్రుంగదీసింది.
స్నేహితుడైన గణేష షర్మ, వలితుడి బాద చుసి, పరి పరి విధాల ఆలోచించి, "నీవు ఏ పని చేయించుకోవలనుకుంటే, దానికి వ్యతిరేకముగా పనిచేయమని ఆమెకు చెప్పు. అందుకు వ్యతిరేకముగా ఆమె చేస్తుంది. కనుక నీ పని నెరవేరుతుంది" అని సలహా ఇచ్చాడు.
కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్దికం వచింది. స్నేహితుడి సూచన మేరకు వలితుడు "రేపు మా తండ్రిగారి ఆబ్దికం, నె పెట్టదలచలేదు" అని చండి తో అన్నాడు. భర్త మాటలు విన్న చండి మామగారి ఆబ్దికాన్ని దగ్గరుండి, వలితుడి చేత పెట్టించింది. అన్ని సవ్యముగా జరుగుతున్నాయన్న సంతోషంలో వలితుడు, చండితో "పిండాలను తెసుకునిపోయి నదిలో పడవేయి" అని అన్నాడు. వెంటనే చండి, పిండాలను కాలువలో పదేసింది. విరక్తి చెందిన వలితుడు ఇల్లు వదిలి అరణ్యాల బాట పడ్డాడు.
కొంతకాలం తరువాత, ఆశ్వీయుజ పౌర్ణమి వచ్చింది. సాయంత్రం అయింది, నాగకన్యలు ముగ్గురు వచ్చి నదిలో స్నానమాచరించి లక్ష్మీదేవిని పూజించారు. పాచికలు ఆడేందుకు సిద్దపడ్డారు. నాలుగో మనిషి తక్కువ ఉండటంతో, యెవరైన ఉన్నరేమొ అని చుట్టుపక్కల చూసారు. వలితుడు కనిపించడంతో, ఆడటానికి ఆహ్వానించారు. అది జూదమని ఆడరాదని వలితుడు అనడంటో, ఈ దినం పాచికలు ఆడటం నియమమని అనడంతో వలితుడిని పాచికలను ఆడెందుకు అగీకరింపచేసారు.
భూలోకంలో ఎవరు మేలుకుని ఉన్నారో చూసేందుకు భూలోకం వచ్చిన శ్రీమన్నారాయణుడు, శ్రీమహాలక్ష్మి కి, ముగ్గురు నాగకన్యలు, లవితుడు పాచికలు ఆడుతూ కనిపించారు. దానికి సంతసించిన ఆది దంపతులు సర్వసంపదలను ప్రాసాదించారు.

కోజాగరి వ్రత విధానం
ఆశ్వీయుజ పూర్ణిమనాడు ముక్యంగా స్త్రీలు బ్రాహ్మే ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని ఇంటిని శుభ్రపరచుకుని, పూజామందిరంలో కాని లేదా పూజ చేయదలాం చుకున్న చోట మండపమును ఏర్పరుచుకుని అందులో శ్రీలక్ష్మి విగ్రహమును గాని, పతమును గాని ప్రతిష్టించుకుని ముందుగా గణపతి పూజచేసి అనంతరం శ్రీలక్ష్మిదేవిని షోడశోపచారాతో, అష్టోత్తరశతనామములతోనూ పూజచేయాలి.
శక్తికొలది నైవేద్యం పెట్టి, తిరిగి చంద్రోదయం అయిన తరువాత లక్ష్మీదేవిని పూజించాలి. పాలు, పంచదార, పలకపొడి, కుంకుంపువ్వు, బియ్యం వెసి క్షీరాన్నం వండి, నైవేద్యంగా పెట్టాలి. తరువాత క్షీరాన్నాన్ని ఆరుబట వెన్నెలలొ పెట్టి కొద్దిసేపు తరువాత ప్రసాదముగా తీసుకోవాలి.
ఇలా ఆరుబయట ఉంచడంవలన చంద్రకిరణాల ద్వారా అమృతం వచ్చి అందులో పడుతుందని నమ్మకం. తరువాత రాత్రి జాగరం చేయాలని శాస్త్రం చెబుతోంది.
జాగరణ సమయంలో పాచికలు లేదా గవ్వలు ఆడుతూ గడపాలని ఆచారం. ఆశ్వయుజ పూర్ణిమనాటి రాత్రి శ్రీమహాలక్ష్మి భూలోకమంతా తిరుగుతూ ఎవరైతే జాగరణ చేస్తూంటారో వారికి సిరిసంపదలను చేకూరుస్తుందని కధనం. మరుసటి రోజు పునః పూజ చేసి వ్రతం పరిసమాప్తి చేయాలి.
అంతేకాకుండా ఇదేరోజు మనరాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో "గొంతెమ్మ పండుగ"ను చేస్తారు. కుంతీమహేశ్వరిని పూజిస్తారు. అరిసెలు, అప్పములు, కూరలను నైవెద్యముగా సమర్పిస్తారు.
ఆశ్వయుజ పూర్ణిమనాడు నారదీయ పురాణమును దానం చేయడం వల్ల మరణాంతరం ఇష్టలోకప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

Popular Posts

Popular Posts

Ads