మంత్రాలయం రాఘవేంద్ర స్వామి:
కర్నూలు నుండి ఎమ్మిగనూరు ద్వారా తుంగభద్రానదీ తీరంలో పెద్ద సన్యాసులైన శ్రీరాఘవేంద్రస్వామి సమాధి నొందిన బృందావనం ముఖ్య విశేషం మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి సమాధి దేవాలయం మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషనుకు సుమారు 15కి.మీ. దూరం వుంది. ఇక్కడకు రాష్ట్రంలో పలుచోట్ల నుండి టూరిస్టు బస్సులు, R.T.C. బస్సులు నడపబడుతున్నాయి. భారతీయాత్మ, ఆధ్యాత్మిక విద్య 'ద్వైతవేదాంతము' నకు విశిష్టసేవ చేసిన మహామహులు, ఉపనిషత్తులకు ఖండార్ధలు, అనేక ఆధ్యాత్మిక గ్రంధాలకు వ్యాఖ్యానములు వ్రాసి జ్ఞానభక్తిని ప్రభోధించిన సద్గురువు శ్రీమంత్రాలయ రాఘవేంద్రస్వామి వారు. వారు ఇక్కడనే జీవసమాధి పొందారు.
వీరు మహాభక్తుడు, పురాణ పురుషుడు, హిరణ్యకశివుని కుమారుడు, నరసింహవతార కారకుడైన ప్రహ్లాదుని అవతార విశేషమయి భక్తులకు కల్పవృక్షమై క్రీ.శ.1671 నుండి 700 సంవత్సరములు ఆశ్రితులను అనుగ్రహిస్తుండగలనని అభయమిచ్చారు. ఇప్పుడు గూడ అనేకమంది హృదయాల్లో భక్తకల్పవృక్షమై వెలసి కృపాకటాక్ష వీక్షణాలను ప్రసరింప చేస్తున్నారు. ఇక్కడ కులమత వివక్ష లేకుండా నిత్యమూ జనసందోహ భరితమై ప్రార్ధనల నిలయమై శోభిల్లుతున్నది. స్వామివారి సమాధిని చూడబోయే ముందుగా ఆగ్రామదేవతయైన మంచాళమ్మను విధిగా దర్శించాలనేది స్వామివారి అభీష్టంగా చెప్పుకుంటారు. స్వామివారికి భాద్రపద మాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది. భక్తులు విశేషంగా వస్తారు.
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.