Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

నారాయణ తత్వాన్ని దర్శించిన మొదటి ముగ్గురు ఆళ్వారులు (ముదల్ ఆళ్వార్లు) Narayana visited the philosophy of the first three alvarulu ( Mudhal Alvar )



మనకు నాలుగు వేల దివ్య ప్రబంధాలను పాడి అందించిన వాళ్ళు పన్నెండు మంది ఆళ్వారులు. ఆందులో మొదటి ముగ్గురు ఆళ్వార్లు కలియుగానికి ముందు జన్మించిన వారు. వారు అందమైన రీతిలో తత్వాన్ని దర్శించినవారు. అందుకు ఒక చరిత్ర ఉంది. అందులో ఒక ఆళ్వార్ సరస్సులో లభించారు. అందుకు ఆయనకు సరోయోగి అని పేరు. పొయ్-గై  అంటే ద్రవిడ భాషలో సరస్సు అని అర్థం.  మరోక ఆయన పుష్పంలో పుట్టారు అందుకే ఆయనకు పూదత్త, క్రమేపి భూత యోగి లేక భూదత్తాళ్వార్ అని పేరు వచ్చింది. మరొకాయనకు భగవంతుడు అంటే పిచ్చి వ్యామోహం, అందుకే ఆయనకు మహాయోగి అని పేరు. పేయ్ ఆళ్వార్ అని అంటారు. పేయ్ అంటే ద్రవిడ భాషలో పిచ్చి అని అర్థం.
 
 
ఈ ముగ్గురూ ఒక నాడు అందమైన రీతిలో ఒక దగ్గరికి చేరారు. ఒక నాడు వానా కాలంలో ఒక ఆళ్వార్ ప్రయాణం చేస్తున్నాడు, వర్షం బాగా పెరిగి పోయింది, చీకటిగా ఉండటంతో ఒక ఇంటి తలుపు తట్టి అక్కడే ఇంటికి ముందు ఉన్న చిన్న గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ గది చాలా చిన్నదిగా ఉంది, ఒక్కరు మాత్రం పడుకొని విశ్రాంతి తీసుకోవచ్చు. కొంత సమయానికి మరోక ఆళ్వార్ అదే ఊరికి వచ్చాడు. వర్షం ఉండటంతో ఆశ్చర్యం అదే ఇంటి తలుపు తట్టాడు. అప్పుడు మొదట వచ్చిన ఆళ్వార్ లేచి ఆయనకీ అశ్రయం ఇచ్చాడు. అప్పుడు ఇద్దరు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. మరి కొంత సమయానికి మరొక ఆళ్వారు అక్కడికే వచ్చి తలుపు తట్టాడు. ఇద్దరు కూర్చొనే వద్ద ముగ్గురు నిలుచొని సర్దుకోవచ్చుకదా అని ఆయనకి ఆశ్రయం ఇచ్చారు.
  
కొంత సమయానికి ఒకరిని ఒకరు తోసుకుంటున్నట్లు అని పించింది. చీకటిలో ఎవరు ఎవరిని తోస్తున్నారో కనిపించటంలేదు. ముగ్గురూ నేను కాదు తోసేది అని చెప్పారు. మరి ఎవ్వరో నాలుగో వ్యక్తి వాళ్ళని తోస్తున్నాడు, అది కనిపెట్టాలి అని అనుకున్నారు. వాళ్ళ దగ్గర దీపం కూడా లేదు.  అందులో ఒకాయనకి ఆలోచన తట్టింది. మాములుగా మనం వెలిగించే మామూలు దీపంలా కాకుండా, "వైయ్యంతగనయా వార్కడలే నెయ్యాగ" భూమండలం అంతా ఒక ప్రమిద అన్నాడు, ఈ సాగరాన్నే నెయ్యిగా పోస్తున్నాను. మరి దీపమో "వెయ్యకదిరోన్ విళక్కాగ" సూర్యుడే దీపం ఇదిగో చూడండి అన్నాడు. "సెయ్య శుడరాయానడిర్కే సూటినేన్ సొన్మాలై" చీకటి అంతా తొలగించడానికి ఇదిగో దీపం అని ఎత్తిపట్టాడు.ఆశ్చర్యం! మనం వెలిగించగలమా ఇట్లాంటి దీపాన్ని! వారు భగవత్ తత్వ సందర్శన చేయగల విశాల హృదయం కల మహనీయులు. ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం కూడా భగవన్మయమే. మనకు కనిపించే చేతన అచేతనమైన అన్నింటినీ ఆక్రమించినవాడు పరమాత్మ. 'ఈసావాస్యం ఇదగుం సర్వం ఎత్ కించ్య జగత్యాం జగత్' పరిణామశీలమైన ఈ భాహ్య ప్రకృతిలో ఉన్న ప్రతు వస్తువూ పరమాత్మచే వ్యాపింపబడే ఉంది అని ఉపనిషత్ చెబుతుంది. ఈ విషయం తెలిసిన వారు ఆయన, అందుకే ఈ భాహ్యమైన ప్రతి వస్తువూ భగవన్మయం అని చెప్పారు. భూమి ప్రమిదగా, నీల్లు నెయ్యిగా, దీపకాంతి సూర్యుడు అని మూడు తత్వాలని చెప్పాడు. భూమి, నీరు మరియూ తేజస్సు ఈ మూడింటి నుండే ఏర్పడింది ఈ విశ్వమంతా అని మనకు చందోగ్య ఉపనిషత్ చెబుతుంది. ఆ మూడింటితో దీపం వెలిగించి, భాహ్య మైన ప్రతి వస్తువూ పరమాత్మాత్మకం అని గుర్తించాడు ఒకాయన.
 



ఆ కాంతి సరి పోలేదు. కేవలం బయటకి కనించేవేనా పరమాత్మ సంబంధం కలవి. మనలోని జీవుడెవరు ? జ్ఞానం ఎవరు ? రెండో ఆళ్వార్ మరొక దీపం నేను వెలిగిస్తా అన్నాడు. 'అన్బే తగళయా ఆర్వమే నెయ్యాగ ఇన్బురుహు సిందయిడు తిరియా నన్బురుహు జ్ఞాన చుడర్ విళక్కేతినేన్ మాన నర్కునన్ జ్ఞాన తమిళ్పురిందనాళ్' మనలోని ప్రపంచాన్ని చూసి ఇది నాది అనే అహంకారం మనకు ఉంటుంది. ఇది పరమాత్మకు చెందినది అని చెబితేగాని ఈ అహం అణగదు. ఆందుకే 'అన్బే తగళయా' నాలోని ప్రేమనే ప్రమిదగా చేస్తున్నాను, ఆప్రేమ ఎవరిమీద అయితే పుట్టిందో వారిని పొందాలనే త్వర ఉండాలి. 'ఆర్వమే నెయ్యాగ' ఆ ఆర్తియే నెయ్యి పొస్తున్నా. ఇదివరకు స్వామి గురించి విని చేసిన చింతననే ఒత్తులుగా పెట్టి, జ్ఞానమనే దీపాన్ని వెలిగిస్తున్నా నారాయణ అనే తత్వాని కోసం అని అన్నాడు.  విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఒకే తత్వం దాని పేరు నారాయణ. మనకు నారములు అని పేరు. చేతన అచేతనమైన వస్తువులన్నింటికీ నారములు అని పేరు. 'ర' అంటే నశించేది అని అర్థం. 'నర' అంటే నశించనివి అని అర్థం. ఇవి ఎప్పటికీ నశించవు, వాటి ఆకృతి మారుతుంది తప్ప. ఈ నారములన్నింటికి లోన బయట ఉండి ఆధారం అయిన తత్వమే నారాయణ అని అంటాం. మంత్ర పుష్పం ఇదే చెబుతుంది 'అంతర్ బహిశ్య తత్ సర్వం వ్యాప్య నారాయణ స్తితః'
 
  
ఈ ఇద్దరు లోన బయట వ్యాపించి ఉండే నారాయణ తత్వాన్ని చూపే దీపాలని వెలిగించగానే మూడో ఆయనకి ఆ తత్వం స్పష్టంగా కనిపించింది. ఇలా ఒక్కొక్కారూ ఆ తత్వాన్ని దర్శించి ఒక్కో ధివ్య ప్రభందాన్ని అందించారు. తత్వమే వీరికోసం దిగివచ్చింది కనక వాళ్ళు చూడగలిగారు, ఆందుకే వారు ఆళ్వారులు అయ్యారు.        

Popular Posts

Popular Posts

Ads