నవదుర్గలు
వైదిక సంప్రదాయంలో దేవి త్రిమూర్తులశక్తిగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రునిర్మూలనానికీ, ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు మహాలక్ష్మి, విద్య విజ్ఞానానికి మహా సరస్వతి అధిష్టాన దేవతలుగా రూపొందారు
దుర్గ అమ్మవారు తన ప్రతిరూపాలుగా మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి ని సృష్టించారు. మరల మహాసరస్వతి ,మహాలక్ష్మి, మహాకాళి తిరిగి తమ ప్రతిరూపాలను సృష్టించుకొన్నారు.మొత్తంఈ రూపాలన్ని కల్సి నవదుర్గలుగా మన చేత పూజలు అందుకొంటున్నారు.
నవదుర్గలు : శైలపుత్రి, బ్రహ్ మచారిణి, చంద్రఘంట,కూష్మాండ, స్ కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్దదాత్రి.
శైలపుత్రి :
శైలుడి {పర్వతరాజు} కుమార్తె. ఆమెకే సతీ భవాని, హిమవంతుడి (హిమాలయాలకు రాజు) కూతురు హిమవతి, పార్వతి అను పేర్లు కూడా ఉన్నాయి. నవదుర్గలలో మొదటి రూపం శైలపుత్రి. ఎడమ చేతిలో కమలము, కుడి చేతిలొ త్రిశూలధారణియై. ఎద్దుని వాహనంగా కలిగిఉంటారు అమ్మవారు.
బ్రహ్మచారిణి
కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలము కలిగిఉంటుంది. ఙ్ఞానం కలిగించే గొప్ప శక్తి కల దివ్య రూపం. తనను ఆరాధించే భక్తుల పైన ప్రేమ తో పాటు వారికి సిరి సంపదలను ప్రసాదిస్తుంది. మోక్షం పొందటానికి బ్రహ్మచారిణి ఆరాధన ప్రధానమైనది.
కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలము కలిగిఉంటుంది. ఙ్ఞానం కలిగించే గొప్ప శక్తి కల దివ్య రూపం. తనను ఆరాధించే భక్తుల పైన ప్రేమ తో పాటు వారికి సిరి సంపదలను ప్రసాదిస్తుంది. మోక్షం పొందటానికి బ్రహ్మచారిణి ఆరాధన ప్రధానమైనది.
చంద్రఘంట :
తన సిరస్సు పై అర్ధచంద్రుడిని ఘంటాకారముగా కలిగి ఉండటం వలన ఈమెను చంద్రఘంట అంటారు. పది చేతులతో, పది రకాలైన ఆయుధములతో { జపమాల, ఘంట, బాణం, పద్మం, ఖడ్గం,కమండలం, త్రిశూలం, ధనస్సు, గద, కమలం }, మూడు నేత్రములతో అమ్మవారి రూపం కొలువు తీరి ఉంటుంది. సింవాహినియై తాను దైర్యసాహసాలకు ప్రతీకగా ఉంటుంది.
కూష్మాండ :
సంస్కృతం లో కూష్మాండం అంటే గుమ్మడికాయ అని అర్ధం. ఈ అమ్మవారికి నివేదించే కూరగాయలలో గుమ్మడికాయ ముఖ్యమైనది. అమ్మవారిని శాంతింపచేయడంలో పెట్టే నైవేద్యంలో కూష్మాండం ప్రధానమైనది అందుకే ఈ అమ్మను కూష్మాండదుర్గ అని అంటారు. కు = చిన్నదైన, ఉష్మ = ఉష్ణము, అండ = బ్రహ్మాండము. 8 చేతులతో అష్టభుజిగా ఉండి, కమండలము, ధనస్సు, బాణము, తామర, గడ, చక్రము, మట్టిముంత, 8వ చేతిలో జపమాల ధరించి ఉంటుంది.
స్కందమాత :
దేవ సేనాపతి ఐన సుబ్రహ్మణ్యస్వామి { కార్తికేయుని } తల్లి. ఈమె 4చేతులు, 3కన్నులు కలిగి, సుబ్రహ్మణ్యస్వామిని తన కుడి పైచేయి మీద కూర్చొపెట్టుకొని ఉంటుంది. మరొక చేతిలో కమలమును, ఎడమ చేయి వరములను ప్రసాదించే ముద్రలోను, 4వ చేతితో కమలమును పట్టుకొని ఉంటుంది. మంచి వర్చస్సుతో కూడిన ముఖము కలదై, పద్మాసనిగా కూడ అమ్మవారిని వర్ణిస్తారు.
కాత్యాయని:
కాత్యాయని సాక్షాత్తు గాయత్రీఅమ్మవారి స్వరూపం. ఈమె వింధ్యాచల నివాసిని.కాత్యాయని ఉపసన వలన భయాలు దూరమవుతాయి. తామరపువ్వు, ఖడ్గము, అభయ హస్తములతోటి అమ్మవారు కొలువై వుంటారు.
కాళరాత్రి :
రాత్రి చీకటిలా నల్లటి వర్ణంతో, జలపాతల వంటి కురులు కలిగి ఉంటుంది. ప్రకాశవంతమైన వెలుగు కల మాలతో, నిప్పులు గక్కె త్రినేత్రధారియై, గార్దభ వాహినిగా, చతుర్భుజి గా, కుడి వైపున ఒక చేయి వరప్రసాదినిగా, రెండవ చేయి అభయంగా, ఎడమవైపు పొడవుగా ఉండే పదునైన కత్తితో, మరో చేతిలో కొడవలితో దర్శనం ఇస్తుంది.
మహాగౌరి :
తెల్లటి ఆభరణాలతో, తెల్లటి శరీరఛాయ కలిగి, చతుర్భుజి, వృషభవాహినిగా ఉంటుంది. త్రిశూలము, ఢమరుకము, అభయము, వరప్రసాద హస్తములతో దర్శనం ఇస్తుంది.
సిద్ధదాత్రి :
మార్కండేయ పురానంలో అష్ట సిద్దుల గురించి వివరించారు. అవి అణిమా సిద్ధి, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకమ్య, ఇషిత్వ, వషిత్వ సిద్దులు. ఈ అష్టసిద్దులను ప్రసాదించేది సిద్ధదాత్రి. దేవీభాగవత పురాణంలో చెప్పినట్లు, సిద్ధదాత్రి అనుగ్రహం వలనే పరమశివుడు సిద్ధులను సాధించాడు. ఆమె అనుగ్రహం వలనే అర్ధనారీశ్వర రూపం పొందాడు.
మార్కండేయ పురానంలో అష్ట సిద్దుల గురించి వివరించారు. అవి అణిమా సిద్ధి, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకమ్య, ఇషిత్వ, వషిత్వ సిద్దులు. ఈ అష్టసిద్దులను ప్రసాదించేది సిద్ధదాత్రి. దేవీభాగవత పురాణంలో చెప్పినట్లు, సిద్ధదాత్రి అనుగ్రహం వలనే పరమశివుడు సిద్ధులను సాధించాడు. ఆమె అనుగ్రహం వలనే అర్ధనారీశ్వర రూపం పొందాడు.