Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

సాయంకాల సంధ్యావందనము: Sandhyavandanamu evening :

సాయంకాల సంధ్యావందనము:
సాయంకాల సంధ్యావందనము:-
ఈ సాయం సంధ్యావందనము సాయంకాలం సూర్యాస్తమయము నకు ముందు ఈ సాయం సంధ్యావందనము పూర్తిచేయవలయును.
ప్రాతః సంధ్యావందనము మరియు, మధ్యాహ్నిక సంధ్యావందనము వలె, ప్రారంభము నుండి ప్రారంభించి, అనగా కేశవ నామాలు, ఆచమనం, భూశుద్ది, ప్రాణాయామం, సంకల్పము, శుద్దోదక స్నానము వరకు యధావిధిగ ఆచరించి సంధ్యామంత్రము (మంత్ర భాగము) సంధ్యా వందమునకు, ఈ క్రింది మంత్రమును అనుసంధానించుకొన వలయును.
సాయం సంధ్యా మంత్రము:-
కుడి అరచేతిలోనికి జలము తీసుకొనవలయును తర్వాత
“అగ్నిశ్చేత్యస్య మన్త్రస్య యాజ్ఞ వల్క్య ఋషిః
ప్రకృతి ఛందః అగ్ని మామన్యు మాన్యు పతయో
అహర్దేవాతా, జలాభి మంత్రనే వినియోగః !
మంత్రము:-
|ఓం అగ్నిశ్చ మామన్యుశ్చ మాన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః |
పాపే భ్యో రక్షన్తాం! యదహ్నా పాపమ కారుషం
మనసా వాచా హస్తాభ్యాం! పద్భ్యాం ఉదరేణ శిశ్నా|
అహస్త దవలు మ్పతు, యత్కించ దురితం మయి, ఇదమహం
మామమృత యోనౌ, సత్యేజ్యోతిష, జూ హోమీ స్వాహా|
త్రిరాచమేత్ (మూడు పర్యాయములు ఆచమనం చేయాలి)
సాయం సంధ్యావందనం సంపూర్ణం.
త్రిరాచామేత్ (మూడు పర్యాయములు ఆచమనము చేసిన తర్వాత)
ఎడమ చేతిని గోకర్ణాకృతిలో ఉంచి కుడి చేతితో ఉద్దరిణితో జలము తీసుకొని ఎడమ చేతిలో వేసుకొని, కుడి చేతి బొటన వ్రేలితో తడి చేసుకొని కరన్యాసము చేయుచూ ఈ క్రింది విధముగ అను సంధానించవలయును.
ద్విః పరిముజ్య :- ఎడమ అరచేతిలోని జలమును కుడి బొటన వ్రేలిని ముంచి ఎడమ వైపు నుండి కుడివైపునకు కుడివైపు నుండి ఎడమ వైపునకు పై పెదవిని క్రింది పెదవిని తుడుచుకొన వలయును.
సకృదుప స్పృశ్య:- జలముతో ఎడమ అరచేతిని, కుడి అరచేతితోను, కుడి అరచేతిని ఎడమ అరచేతిని, రెండునూ ఒక దానితో మరొకటి తుడుచుకొనవలయును.
యత్సవ్యం పాణిం:- కుడి చేతితో, ఎడమ చేతిలోని జలమును తగులుచూ రెండు చేతులూ తుడుచుకొనవలయును.
పాదం................... :-కుడిచేతితో ఎడమ పాదముపై జలము చల్లుకోనవలయును.
ప్రోక్షతి శిరః............... :- కుడిచేతితో జలము తలపై జలము చల్లుకోనవలయును.
చక్షుషీ ................. :- కుడి బొటనవ్రేలు, ఉంగరపు వ్రేలు రెండూ కలిపి పట్టుకొని కుడి కంటిని ,ఎడమ కంటిని ఆ రెండు వ్రేళ్ళ కలయికతో తాకావల యును.
నాసికే..............:- ఆ రెండు వ్రేళ్ళతో ముక్కు కుడిభాగమును,ఎడమ భాగమును తాకవలయును.
శ్రోతే .............. :- అదే ఆ రెండు వ్రేళ్ళతో కుడి చెవిని ఎడమ చెవిని తాకవలయును.
హృదయ మాలభ్య:- హృదయముపై జలమును చల్లుకొనవలయును. తర్వాత లేచి సూర్యునికి ఎదురుగా నిలబడి ఈ క్రింది మంత్రములు అనుసంధానించుకొనుచూ తలపై జలము చల్లుకొనుచూ అనుసంధానించ వలయును. ఓం ధదిక్రా ఉణ్ణో అకారిషం జిష్ణోరస్వశ్చ వాజినః తలపై జలము చల్లుకొనవలయును
సురభినో ముఖాకరతు ప్రణ ఆయూగం శ్రీ తారిషతు తలపై జలము చల్లుకొనవలయును
ఆపో హిష్టా మయో భువః తలపై జలము చల్లుకొనవలయును
తాన ఊర్జే ధదాతన తలపై జలము చల్లుకొనవలయును
మహేరణాయ చక్షసే తలపై జలము చల్లుకొనవలయును
యోవఃశివత మొరసః తలపై జలము చల్లుకొనవలయును
తస్య భాజయతే హనః తలపై జలము చల్లుకొనవలయును
ఉష తీదివ మాతరః తలపై జలము చల్లుకొనవలయును
తస్మా ఆరంగ మామవహ తలపై జలము చల్లుకొనవలయును
యస్యక్షయాయ జన్వథా తలపై జలము చల్లుకొనవలయును
అపోజనయథా చనః తలపై జలము చల్లుకొనవలయును
హిరణ్యవర్నాః శుచయః తలపై జలము చల్లుకొనవలయును
పావకాః యసు జాతః తలపై జలము చల్లుకొనవలయును
తస్యపో యాస్విన్ద్రః తలపై జలము చల్లుకొనవలయును
అగ్నిన్యా గర్భం దధీరే విరూపాః తలపై జలము చల్లుకొనవలయును
తానా ఆపహ శరజ్ఞుశ్చోనా భవంతు తలపై జలము చల్లుకొనవలయును
వ్యాసాగుం రాజా వరుణోయాతి....తలపై జలము చల్లుకొనవలయును
మధ్యే సత్యానృతే అవపశ్యం జనానాం తలపై జలము చల్లుకొనవలయును
ఆధుశ్చుతః శుచయోయాః
పానకాః తలపై జలము చల్లుకొనవలయును
తాన ఆపః శగ్ముశ్చోనా భవంతు.. తలపై జలము చల్లుకొనవలయును
యాసాం దేవాదివి కృన్వంతి
భక్షయా తలపై జలము చల్లుకొనవలయును
అంతరిక్షే బహుధా భవస్తు తలపై జలము చల్లుకొనవలయును
పృధివీం పాయ సొన్దంతి
శుక్రాస్తాన తలపై జలము చల్లుకొనవలయును
ఆపశగ్గ్ స్యోనా భవస్తు తలపై జలము చల్లుకొనవలయును
శివేనమా చక్షుశాపస్యతా
పశ్శివయా తలపై జలము చల్లుకొనవలయును
తనువోప స్పృశత త్వచమ్మే తలపై జలము చల్లుకొనవలయును
సర్వాగ్ం అగ్నిగ్ం రప్సుషదో తలపై జలము చల్లుకొనవలయును
హుకే వోమయి పర్చోబల
మోజోనిధిత్త తలపై జలము చల్లుకొనవలయును
తర్వాత శిరస్సు వంచి కుడిచేతితో ఎడమ చెవిని ఎడమ చేతితో కుడి చెవిని (అరి చేతులు బయటకు కనిపించు విధముగా) చెవులను స్పృశిస్తూ
“చతుస్సాగర పర్యన్తం గో బ్రాహ్మణేభ్యశ్శుభం భవతు”
అని అనుసంధానించి(చెప్పుకొని) ఆచమనం చేయాలి.
ఆచమనం చేసిన తర్వాత
కేశవ నామాలు:-
ఓం కేశవాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మదుసూధనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోధరాయ నమః
ఓం శ్రీ వాసుదేవాయ నమః
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి
శ్రీమన్నారాయణేతి సమర్పయామి.
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
అని అనుకొంటూ తీర్థమును దోసిలితో వదలవలయును.
సంధ్యావందనం సంపూర్ణం
సంధ్యావందనం పూర్తి అయిన తరువాత పూజా కార్యక్రమము.

Popular Posts

Popular Posts

Ads