Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

పూజకు ఏమీ వస్తువులు కావలయును మరియు ఎలా చేయాలి: You must be objects of worship and nothing should be done to :

పూజకు ఏమీ వస్తువులు కావలయును మరియు ఎలా చేయాలి:
ప్రాతః కాలములోనే నిద్రలేవాలి, లేచి కాలకృత్యములు పూర్తిచేయలి. తర్వాత స్నానముచేసి (Dress Code పాటించాలి) శుభ్రమైన పొడి వస్త్రము (ధోవతి) ధరించాలి, ఉత్తరీయమును నడుముకు కట్టుకోవాలి. హృదయము పైన ఎలాంటి వస్త్రమూ (బనియను, చొక్కా లాంటివి ధరించరాదు) వుంచుకొనరాదు. వారివారి సాంప్రదాయమును అనుసరించి నుదుటిభాగమును (విభూదితో కానీ చందనముతో కానీ తిరుమణితో కానీ శ్రీ చూర్ణముతో కానీ) తిలకధారణ చేయలి. తిలకధారణ (ముఖాన బొట్టు) లేకుండా పూజమందిర ప్రవేశము నిరుపయోగము. మనము నుదుట బొట్టు ధరించడము, మన సనాతన ధర్మములపట్ల, వేదములపట్ల, పునర్జన్మ సిద్ధాంతము పట్ల, నమ్మకమునకు, గౌరవమునకు సూచన. పూజామందిరము ముందు నిలబడి మెల్లగా చప్పుడు (మూడు పర్యాయములు మెల్లగా సున్నితముగా చప్పట్లుకొట్టుచూ) చేయాలి. మనము పూజమందిరము తలుపుతీయుటకు స్వామి వారిని అనుమతిమ్మని కోరుతూ ఇలా అనుమతిని కోరుతూ చేయుక్రియ. తర్వాత మెల్లమెల్లగా పూజమందిరము తలుపును తీయలి.
పూజమందిరములోనికి వినయముతో, భయభక్తులతో, అతిజాగ్రత్తగా, వినమ్ర మనస్కులమై లోనకు ప్రవేశించాలి (ఒక అధికారి తో అతి ముఖ్యమైన ఎంతో అత్యవసరమైన పని ఉన్నప్పుడు ఎంతో గౌరవముగా తలుపువద్ద నిలబడి అతివినయము ప్రదర్శిస్తూ (“MAY I COME IN SIR,”) అని అడిగి లోనకు ప్రవేశిస్తాముకదా. మరి మన స్వామి జగత్తు కే అధికారి, ఆ అధికారి గదిలోనికి ప్రవేశించేటప్పుడు, ఎంత జాగరూకతతో ప్రవేశించాలి, ఒకసారి ఆలోచించండి.
అతి జాగ్రత్తగా స్వామివారి సింహాసనమును, పూజామందిరములోని నిర్మాల్యమును (నిన్నటి రోజున మనము స్వామివారికి సమర్పించిన ఫల పుష్పాది తీర్థప్రసాదములను, కుంకుమాది అక్షితాది పూజా వినియోగములను, దీపారాధన సామగ్రిని) అతి సున్నితముగా, భయభక్తుతలతో, తొలగించాలి. తదుపరి పూజామందిరమును శుభ్రముగా శుభ్రపరచాలి. 
1. పూజకు సమయ పాలన అతి ముఖ్యమైన అంశము. ఉదయం 6 గం|| పూజ అంటే మనము ఎక్కడ ఉన్నా తప్పకుండా ఉదయం 6 గం|| పూజ ప్రారంబించాలి, అనే నడవడిని మనము మన మనస్సుకు తరఫీదు ఇవ్వాలి. ఉదా :- పదవీ విరమణ చేసిన ఒక సైనికుడు ఇంటికి వచ్చేస్తాడు. (మిలటరీ ఉద్యోగి). అయినా అతడు మరణించే అంత వరకు, మిలటరీలో ఎలా అయితే ఉదయం 4 గం|| నిద్ర లేస్తారో, అదేవిధముగ పదవీవిరమణ చేసి, ఇంటి దగ్గర తన భార్యబిడ్డలతో ఉన్నా, క్రమం తప్పకుండా 4గం|| నిద్రలేస్తాడు. ఎందుకు? అతని మనసుకు కొన్ని సంవత్సరములుగ మిలటరీ వారు ఇచ్చిన ప్రాక్టీసు.
2. పూజకు (పూజ వేళకు) ఉపయోగించడానికి విడి విడిగా పాత్రలలో (పంచ పాత్ర) శుద్ద జలము సిద్దము చేసుకోవాలి. పూజకు ఒక ఉద్దరిణి, పంచపాత్ర, చిన్న గ్లాసులు రెండు , తట్ట, గంట, హారతి పళ్ళెము సిద్దము చేసుకొనవలయును. 3. వారి వారి అభిరుచుల (ఇష్టదేవత/గురూపదేశము) ను అనసరించి అర్చనామూర్తిని సిద్దము చేయవలయును.
ముఖ్య గమనిక:- దైవము యొక్క ప్రతిమగానీ, Photo గానీ సిద్దము చేసుకున్న తరువాత, త్రికరణ శుద్దిగా, పూజ సమయంలో కానీ, పూజానంతరం కానీ, పూజ గదిలో ఉన్నది ప్రతిమ, Photo అనే భావన ఏ పరిస్థితులోనూ రాకూడదు. అక్కడ సింహాసనము పై అర్చనా మూర్తి ఆసీనులైఉన్నారని, అక్కడ కూర్చొని మనలను మన కుటుంబమును ఎల్ల వేళలా, చూచుచూ మనలను కాపాడు చున్నాడని, మరువ రాదు. స్వామి వారు అక్కడకు వచ్చి కూర్చొని ఉన్నారు, అనే భావనతో భయ భక్తులతో పూజ ప్రారంభించాలి.
4.దీపారాధనకు పత్తితో తయారు చేసిన వత్తులను సిద్దం చేసుకోవాలి. దీపారాధనకు యధాశక్తి తైలమును(నూనెను) ఉపయోగించాలి. ఆవు నెయ్యి సర్వశ్రేష్ఠము.
5.ధూపారాధనకు అగరబత్తీలు, ధూప్ స్టిక్కులు, సాంబ్రాణి సిద్దంచేసుకోవాలి. అగ్ని హోత్రము తయారుచేసి సాంబ్రాణి వేయడము శ్రేష్ఠము.
6.పసుపు, కుంకుమ, అక్షితలు, పూలు, పళ్ళు, తమలపాకులు, వక్కలు, గంధము (అంగడిలో అమ్మే గంధము కాకుండా ఇంటిలో సానరాయి, గంధపు చెక్క ఉంచుకుని, నిత్యము గంధము తీసి భగవంతునికి సమర్పించడం సర్వ శ్రేష్ఠము) ఆగరు వత్తులు, హారతికి కర్పూరము, కొబ్బరికాయ (యధాశక్తి) సిద్దం చేసుకొనవలయును.
7. నివేదన నిమిత్తo నిత్యము బెల్లము ముక్కను తప్పనిసరిగా ఉంచవలయును. అలాగే నైవేద్యమునుకు సాత్వికాహారము, సాత్విక పదార్థాము లను, నివేదించవలయును. భగవంతునికి (పూజకు) ఒకటి, మనము భుజించడానికి ఒకటి, తయారు చేయుట నిషిద్దము. భగవంతునికి ఏమి నివేదించుతామో మనము కూడా అదే తీసుకొనవలయును. తర్వాత 
గురుపరంపర ప్రార్థన:
శ్రీమతే రామానుజాయ నమః శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః
పోదు త్తనియన్లు ప్రాతార్నిత్యాను సంధేయ శ్లోకములు
మణవాళమహామునుల తనియన్ –శ్రీ రంగనాథులు ప్రసాదించినది.
1) శ్రీ శైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్|
యతీన్దృ ప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్||
శ్రీ గురుపరంపర తనియన్- కూరత్తాళ్వానులు సాయించినది.
2) లక్ష్మీనాథ సమారమ్భాం నాథ యామున మధ్యమామ్ |
అస్మదాచార్య పర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్||
ఎంబెరుమానార్ తనియన్- కూరత్తాళ్వాన్ సాయించినది.
౩. యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే|
అస్మద్గురో ర్భగవతోఽ వ్యామోహత స్య దయైకసిన్దోః
రామానుజస్య చరణౌ శరణం ప్రవద్యే ||
నమ్మాళ్వార్ తనియన్- ఆళవందార్ సాయించినది.
4. మతా పితా యువతయ స్తనయా విభూతిః
సర్వం యాదేవ నియమేన మదన్వయానామ్
అద్యస్య నః కులపతే ర్వకుళాభి రామం
శ్రీమత్త దం ఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా
ఆళ్వారుల తనియన్ – శ్రీ పరాశరభట్టర్ ఆనతిచ్చినది.
5 భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాధ
శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహన్
భక్తాంఘ్రిరేణుపరకాల యతీన్దృమిశ్రాన్
శ్రీ మత్పరాంకుశ మునిం ప్రణతోఽస్మి నిత్యమ్ 
గురుపరంపర ప్రార్థన తర్వాత
“శుక్లాం భరధరమ్ విష్ణుమ్” శ్లోకం తో ప్రారంభించి ఇష్టదేవతా ప్రార్ధనాశ్లోకాలు పద్యాలు, మంత్రాలు పఠించుచూ పూజ చేసుకోవలయును.
వారివారి సమయభారమునుబట్టి శ్రీ విష్ణుసహస్రనామాలు, శ్రీ లలితా సహస్రనామాలు శ్రద్దాభక్తులతో మనసును స్వామి పదములమీద ఉంచి ఏకాగ్రతతో పఠించి పూజాకార్యక్రమమును చేసుకొనవలయును.
నిత్యాంతరంగ ప్రార్ధన
1. పరమాత్మా నన్ను బ్రాహ్మ ముహూర్తములో (ఉదయం 4 గంటలకు) నిద్ర నుండి లేచి ఈశ్వరారాధనాభిముఖునిగా ఉండునట్లు, నా బుద్ధిని ప్రచోదనము చేయుము. దయా సింధో సర్వకాల సర్వావస్తలయందు, నిన్ను స్మరించు బుద్ధిని నాకు ప్రసాదించు.
2. సత్సాంగత్యము(భగవాన్ భక్తులతో స్నేహము) నిరంతరము కొనసాగునట్లు నన్ను ఆశీర్వదింపుము. అనాయాస మరణము, చివరి శ్వాస నీ ధ్యాసలో ఉండునట్లు అనుగ్రహింపుము.
3. అరిషడ్వర్గములను జయించు శక్తిని, నా బుద్ధికి ప్రసాదింపుము. నిరంతరం పరోపకారమే పరమావధిగా, మానవ సేవే మాధవ సేవ యను భావము, నాలో నిరంతరము కొనసాగించుము.
4. దేహాభిమానమును నాలోని అహమును పారద్రోలుము. ప్రేమతో నా హృదయమును నింపుము. ప్రకృతిలో సకల జీవరాసులలో, పరమాత్మను చూచు భూత దయను, నాకు ప్రసాదింపుము.
5. ప్రతి స్త్రీ యందు మాతృమూర్తిని, పరదేవతను (అమ్మను) దర్శించగలిగే బుద్ధిని, జ్ఞానమును నా బుద్ధికి,మనస్సుకు ప్రసాదించుము.
6. నిజాయితీతో ధర్మబద్దమైన జీవితమును, ధర్మయుత సంపాదనను, ధర్మ పాలనను ప్రసాదించుము. ధర్మానుష్టానములో వచ్చే ప్రమాదములను, బాధలను,కష్టములను, మీ యొక్క ప్రసాదముగా స్వీకరించి నిరంతరము మీరు ఇచ్చిన దానితో, సంతృప్తిగా జీవించే బుద్ధిని అనుగ్రహింపుము. ధర్మచట్రములో ఇముడు పనులను మాత్రమే నా బుద్ధికి మనస్సుకు ప్రచోదనము చేయుము. 
7. తల్లి తండ్రుల, గురువుల, పాదపద్మములకు, ప్రాతః కాలమున త్రికరణ శుద్ధితో, సాంజలి బంధకముగా నమస్కరించే బుద్దిని ప్రసాదించుము.

Popular Posts

Popular Posts

Ads