Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

పరమశివుడు Shiva

పరమశివుడు
త్రిశూలము :
త్రిశూలము పైన మూడు కొనలు కలిగి, ఆ మూడు కలిసి అడుగున కలిసి ఒకే శూలహస్తముగా ఉంటుoది. సత్వ రజ స్తమో గుణములకు ఇది ప్రతీక. వీటి యొక్క ఏకత్వము త్రిగుణాతీతం. అంటే పరమశివుడు త్రిగుణాతీతుడని భావము.
నాగాభరణము :
కుండలిని సర్పాకరం కలిగి ఉంటుంది. కుండలిని ఉద్దీపన అయినపుడు అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. ఆ సిద్ధులను లోకరక్షణార్ధం వినియోగించువాడు కనుకనే ఈశ్వరుడనే పేరు వచ్చింది. ఇందుకు ప్రతీకగా నాగాభరణుడైనాడు.
డమరుకము :
శబ్ద గుణకము ఆకాశము. ఆకాశమునందు శబ్దము యొక్క ప్రకంపనలు ప్రయాణించును. మనము మంత్ర జపము చేసినపుడు కాని, వినినపుడు కాని స్పందనలు / తరంగాలు ఏర్పడి. అవి శివ ఢమరుక ధ్వని వంటి దానిని మన చెవులలో కలిగించును. మంత్ర పురశ్చరణ చేయుట వలన యోగికి ఆనందము కలిగి తాండవము చేయును. దీనికి గుర్తుగానే డమరుకను ధరించును.
విభూతి
ఙ్ఞానము యొక్క స్థితిని తెల్లటిరంగుతో పోలుస్తారు. అదియే విభూతి. మనిషి యొక్క అలోచనలు, కోరికలు నశించుటవలన శుద్ధమైన ఙ్ఞానం కలుగుతుంది. అది ఆనందానికి మూలం. అందుకే శివభక్తులు విభూతిని ధరిస్తారు.
వ్యాఘ్ర చర్మాబరధరుడు :
భయంకరమైన తాంత్రిక శక్తులు, సిద్ధులు, పులి వంటి ప్రమాదకారులు. వాటిని వశపరచుకొన్నవాడు శివుడు. పులి అమ్మణ్ణి వాహనం. ఆమెను పూర్తిగా భార్యవలె ఆధీనమందుంచుకొన్నాదనుటకు సూచనగా పరమశివుడు వ్యాఘ్ర చర్మాబరధరుదైనాడు.
చంద్రకళాధరుడు :
శుద్ధ బ్రహ్మఙ్ఞానం, నిరంతరం స్రవించుచుండు ప్రఙ్ఞ అనువాటిని శివుని జటాజూటంలోని గంగ సూచించుచున్నది. నిత్య ప్రసాంతత. ఆనంద స్థితికి సూచన చంద్రవంక. అందుచే చంద్రకళాధరుని తత్వం అమృతత్వం, ఆనందమయ స్థితి.

Popular Posts

Popular Posts

Ads