శ్రీరామనవమి వ్రత కధా ప్రారంభము
1. శివ భక్తుడైన అగస్త్యమ హర్ష సుతేష్ణ మహర్షితో ఇట్లు పలికెను. ఓ ' సుతేష్ణ మునీ ' నీకు నేను ఒక రహస్యము చెప్పెదను.అని ఈవిధముగా చెప్పుట మొదలు పెట్టెను.
2. చైత్ర మాసమున శుక్ల పక్షమినాడు సచ్చిదానంద స్వరూపియైన రామచంద్రుడు అవతరించెను. కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశో పచారములచే ఆరాధించి పురాణమును పటించి (చదివి) జాగారణముచేసి (నిద్ర మేల్కొని) మరునాడు ఉదయముననే కాలకృత్యములు, నెరవేర్చుకొని తన శక్తికి తగిన భక్తి యుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి పాయసముతో అన్నము చేసి పెద్ద వారిని, బంధువులను తృప్తి పరిచి, గోవు. భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ఆభరణములు ఇచ్చి కౌసల్యా పుత్రుడైన (కొడుకైన) శ్రీరామచంద్రుని ఆనందింపజేయవలెను. ఇలా శ్రీ రామ నవమి వ్రతము భక్తిగా ఆచరించు వాని జన్మాంతరముల పాపముల అన్ని నశించును. ఇంకా సర్వోత్తమ మైన విష్ణు పదము లభించును. ఈ ధర్మం అందరికీ ఇహపరలొ కములందు భోగమును, మోక్షమును కలిగించునది. కావున మహాపాపిఐన నూ శుచియై ఈ వ్రతమును ఆచరించుటచే జన్మజన్మల పాపములన్ని జ్ఞానాగ్నిచే నాశనము అగుటచే లోకాభి రాముడగు శ్రీరామునివలె అన్ని లోకములలోను ఉత్తముడై వెలుగును.
3. శ్రీ రామనవమి వ్రతము రోజున తినెడి నరాధమునకు నరకము కలుగును. అన్నిటి కంటే ఉత్తమమైన ఈవ్రతము చేయక ఇంకే వ్రతము చేసిన సఫలముకాదు. కావున ఈ వ్రతము ఒక సారి చేసి, భక్తితో ఆచరించినచో వారి మహాపాపములు అన్నియూ తొలగి కృతార్దులు అగుదురు. అందువలన నవమి రోజున శ్రీరామ ప్రతిమ ( బొమ్మ) కు పూజ పూజా విధనాము చేత ఆచరించువాడు ముక్తుడు అగును. ఈతని పలుకులు విని సుతేక్షుణుడు ఇలా అడుగు చుండెను. ఓ లోపాముద్రావతీ! ఎప్పుడూ ధనములేని వారైన మానవులకు సులభమైన ఉపాయము చెప్పుమనగా ఆగస్త్యుడు ఇట్లు పలుకుచున్నాడు.
4. ఓ సుతేక్షణా! దరిద్రుడు అగు మానవుడు తనకు కలిగియున్న వరకూ స్వర్ణ రజతాదులలో (అనగా బంగారం) దెనిచే నైననూ పైసలలో పము చేయక శ్రీరాముని ప్రతిమను చేయించి ఈవ్రతం చేసినచో ఆ వ్యక్తి యొక్క సర్వపాపములు తొలగి పోవును. కావున ఎలాగైన ఈ వ్రతమును చేసి జానకీ కాంతుని పూజింపవలయును. ఈ వ్రతమును భక్తి కొలది చేయనివాడు రౌర వాది నరకములో పడును. అనిన విని సుతేక్షుడు ఓ అగస్త్య మహర్షి! శ్రీ రామమూల మంత్ర ప్రభావము నాకు తెలుపవలెను. అనిన అగస్త్యుడు వివరించుచున్నాడు. సమస్తములైన రామ మంత్ర ములలోను, ' రామ షడక్షరి అను మంత్ర రాజము ఉత్త మమని స్కాంద పురాణము. మోక్ష ఖండనము లోని రుద్ర గీత యందు శ్రీరాముని గూర్చి రుద్రుడు(శివుడు) చెప్పుచున్నాడు.
5. ఓ రామ! మణి కర్ణిక ఒడ్డున మరణము పొందే మానవుని దక్షిణ కర్ణమున ( అంటె కుడి చెవియందు) ' శ్రీ రామరామారామ' అను తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు ' తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు ' తారక పర బ్రహ్మము ' అని పిలువబడుచున్నావు. కావున పరిశుద్దము పాపనాశనము యైన శ్రీరామ నవమీ వ్రతము శ్రద్ధా భక్తి గల మానవులకు చెప్ప తగినది. ఇంతే కాక బంగారు, వెండి, రాగి మొ|| న లోహములలో దేనితో నైననూ శ్రీరామ ప్రతిమను చేయించి అందు దేవుని ఆవాహనము చేసి, ఇంతకు ముందు చెప్పిన విధముగ పూజ చేసి, ఆ ప్రతిమ(బొమ్మ) దగ్గర శ్రీరామనవమి రోజున ఏకాగ్ర చిత్తుడై (అంటే మనస్సును దేవుని యందే నిలిపిన వాడై) జపము చేయుచునుండి, మరునాడు పునః పూజ చేసి (అంటే మరల పూజించి) సంపూర్ణ భోజనము దక్షిణ దానములచే బ్రాహ్మణులను సంతోషింప చేయుటచే లోకాభి రాముడైన శ్రీరాముడు అనుగ్ర హించును. (సంతోషించును) కావున మనుజుడు ధన్యుడు అగును. ఈ విధముగ పన్నెండు, సంవత్సరములు చేయుటచే సర్వపాపకర్మలు నశించిన వాడగును.
6. రామమంత్రము తెలియనివాడు ఈ వ్రతము రోజున ఉపవాసము ఉండి (అంటే భోజనము ఇంకా ఆహార పదార్దములు ఏమియు తీసుకొనక) శ్రీరామ స్మరణ చేసిన చో అన్ని పాపములు పోయిన వాడగును. మంచి గురువు వద్ద మంత్రం తెలుసుకున్న వాడై ప్రతి గంట నిశ్చల మైన మనసు కలవాడై, మోక్షమును కోరినవాడై పుజించువాడు సర్వదోషములచే విడువబడి నాశనములేని శ్రీరామ తారక పర బ్రహ్మమును పొందునని ' అగస్త్య మహర్షి వివరించెను.