Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

యాదగిరిగుట్ట: Yadagirigutta

యాదగిరిగుట్ట:
విజయవాడ - హైదరాబాదు రైలు మార్గంలో రాయగిర్ స్టేషనుకు సుమారు 7కి.మీ. దూరంలో వుంది. స్టేషను నుండి బస్సులు, టాంగాబండ్లు చాలా వున్నాయి. ఇది యాదగిరికొండ మీద నున్న శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రము. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రధానమైన యాత్రాస్ధలం. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 315 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకోవచ్చు. కాని కొండమీదికి నేరుగా బస్సులు కూడా ఉన్నాయి. తిరుమల - తిరుపతి, శ్రీశైలంలలో మాదిరిగా కొండమీద అనేక సత్రాలున్నాయి. ఇక్కడి విశేషము ఏమంటే కొండమీద పుష్కరిణిలో స్నానంచేసి, నియమంగా ఒక మండలం రోజులు స్వామికి ప్రదక్షిణలు చేస్తే సర్వబాధలు తొలగి ప్రశాంతతను పొందగలరని గట్టి నమ్మకం. స్వామివారు 16 రోజులకు స్వప్న సాక్షాత్కారంలో దీక్షా పరులయిన భక్తుల సమస్యలకు పరిష్కారం సూచించునని కూడ చెప్పుకుంటారు. 
స్వామివారి బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ తదియ నుండి ప్రారంభమై ద్వాదశి వరకు కోలాహలంగా జరుగుతాయి. 
చూడదగినవి:
శివాలయము, సంస్కృత కళాశాల, అద్దాల మంటపం, పాంచరాత్ర పద్ధతిని అర్చనాదుల్లో శిక్షణ యిచ్చే పాఠశాలలు ముఖ్యములు. 
ఈ ప్రాంతాల్లో ఇంకా చూడదగినవి:
బీదర్‌లో కోట, మాణిక్యనగర్, హుమ్నాబాదు సమీపంలో ఉన్నది - ఒక గొప్ప మహనీయుని సమాధి - పెద్ద నగరంలాగా భవనాలు, సత్రాలు నిర్మించబడ్డాయి. చూడదగిన ప్రదేశం.

Popular Posts

Popular Posts

Ads