వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి .
నవమాసాలు కడుపులో పెట్టుకొని, రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి, పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి క్రుతజ్ఞత చూపడము మానవత్వము ... విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి.
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం.
మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.
కాని ప్రస్తుత కాలంలో వివిధ కారణాలతో చాలా మంది ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నందుకు వారిలో వారు భాధపడుతున్నారు అనేక మంది వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నారు.
కొంత మంది స్వదేశం వచ్చినప్పుడో లేక స్వగ్రామం వచ్చినప్పుడో, ఏ కాశీలోనో ఏ గయలోనో పితృ తర్పణాలు ఒక్కసారి చేస్తే సరిపోతుందని అనుకుంటారు. అది పొరపాటు. ఎందుకంటే పుణ్య నదులలో పుణ్యక్షేత్రాలలో చేసిన కర్మలు పవిత్రమైనవే కాని అవి పూర్తిగా సమాప్తం కావు. కాబట్టి పుత్రులు తామున్నంత వరకు పితృకార్యాలు (మాసికం, ఆబ్దీకం) చేయాలి అలా చేయలేని పరిస్థితులలో ఆ కార్యాన్ని నిర్వర్తించే వారిపై నమ్మకం ఉంచి చేయించిన కూడా ఫలితం లభిస్తుంది.
మాసికాలు, ఆబ్దీకాలు ఒక్క మన తల్లి తండ్రులకు మాత్రమే గాక మగ పిల్లలు లేని బంధువులకు మనం కర్తగా ఉండి ఈ కర్మలను నిర్వర్తించవచ్చును.
ఉదా : మావయ్య, అత్తయ్య, తాత, బామ్మ, అమ్మమ్మ, అన్న, వదిన, తమ్ముడు, భార్య, కొడుకు, పిన్ని, బాబయ్య, పెద్దమ్మ, పెద్దనాన్న మొదలగు వారికి కర్మలను నిర్వహించినచో వారు మోక్షమార్గం పొందగలరు.
తీర్థయాత్రలకి వెళ్ళలేని వారు కనీసం తీర్థయాత్రలు చేసిన వారిని చూసిన, సేవించినా కూడా పుణ్యం కలుగుతుందని పురాణాలలో చెప్పబదింది. అలాగే మాసికాలు, ఆబ్దీకాలు స్వయంగా పెట్టలేని వారు తగు వ్యక్తుల సహాయ సహకారాలతో పెట్టించటం కూడా స్వయంగా పెట్టినంత ఫలితానిస్తుంది. ఇది మన భారతీయతలోని సనాతన ధర్మం, సంప్రదాయం తద్వారా వారి వంశాభివృద్దిని ఆయుక్షేమాన్ని, సుఖ శాంతులను పొందగల్గుతారు.
కాశీ మహా క్షేత్రం లో మీగోత్ర నామాలతో మీ పితృదేవతలకు తీర్థ పురోహితులచే వేదమయీ సంస్థ ద్వారా బ్రహ్మశ్రీ కేసాప్రగడ ఫణీన్ద్ర రాజశేఖర శర్మగారి బ్రహ్మత్వంలో మీ పెద్దల తృప్తి కొరకు తిలతర్పణాలు నిర్వహించబడును కార్యక్రమం నందు రిజిస్టర్ కావుటకు 8688431063 నెంబర్ ద్వారా రిజిస్టర్ కాగలరు
No comments:
Post a Comment