1.గర్భాదానము:- వివాహానంతరము కులగురువు ఇంటి బ్రహ్మగారిచే నిర్ణయింపబడిన సుముహూర్తములో ప్రజాపత్యర్థం కొరకు చేయు క్రియ.
2.సీమంతోన్నయనము:- భర్త, అడవి పంది ముల్లు తెచ్చి, తలలో మొదటినుండి (సీమంతము)బ్రహ్మరంథ్రము వరకు,పాపిటి తీసి, జడను పైకి ఎత్తి మేడి ఆకులతో, తోరణము కట్టుట. గర్భస్తు గృహిణి ఏడవ మాసంలో ఆ గర్భమును చెణకడానికి(పాడు చేయడానికి) దుష్ట గ్రహములు గర్భములో ప్రవేశిస్తాయి. వాటి నివారణ కొరకు సీమంతము అంటారు కానీ అది శాస్త్రములో సీమంతోన్నయనము.
3.పుంసమనము:-అనువంశిక సింహాసనమున (గృహస్తు తన గృహములోని భగవతామూర్తుల) కు నిత్యార్చనకు తనూభవుడు కావలయునని కోరుట.
4. జాతకర్మ:- పుట్టిన శిశువుకు చేయు కర్మ.
5.నామకరణము:- పుట్టిన శిశువుకు (ఏదో పేర్లున్న పుస్తకము పట్టుకొని పేర్లు మన ఇష్టానుసారము పెట్టకుండా) ఇంటి బ్రహ్మచే శిశువు యొక్క జనన కాలమును గణించి తత్ సంబంధమైన పేరు పెట్టుట.
6.అన్నప్రాశన:- శిశువుకు అన్నము మొదటిసారిగా రుచి చూపించుట.
7.చౌలము:- శిఖ ఉంచడము ( పిలక )
8.ఉపనయనము:- తనూభవుని సంస్కరించి, మంత్రోపదేశము చేసి, సనాతన ధర్మమార్గములను తెలియజేయుట. ప్రజాపత్య సంస్కారములు అనెడు నాలుగు సంస్కారములను, పూర్తి చేసి 5ద వది ఐన సమావర్తనము అని ఒక స్నానమాచరించుట. (దివ్య స్నానము)
9.వివాహము:- గృహస్తాశ్రమ ధర్మ స్వీకారము. గృహస్తాశ్రమ ధర్మములో గృహస్తు కు పంచమహాయజ్ఞములు పంచ సంస్కారములు ఉంటాయి.
పంచమహాయజ్ఞాలు:
1.బ్రహ్మయజ్ఞము:- వేదము చదువుకోవడం లేదా వేదము అభ్యసించిన, తెలిసిన పండితులకు నమస్కరించడం.
2.దేవయజ్ఞము:- ప్రతిరోజూ ఈశ్వరాధన చేయడం.
3.పితృయజ్ఞము:- తల్లితండ్రులకు తద్దినం పెట్టడం అమావాస్యలనాడు వారికి తర్పణము వదలడం.
4.భూతయజ్ఞము:- కేవలం గృహస్తులే అన్న పానీయాలు భుజింపకుండా, మిగతా భూతములకు ఆహారము సమర్పించుట.
5.మనుష్యయజ్ఞము:- అతిథి అభ్యాగతులను గృహస్తు, సాదరముగ, త్రికరణ శుద్దిగా ఆచరించుట.
పాత్రయజ్ఞములు అనేవి 7 యజ్ఞములు
హిరణ్యయజ్ఞములు అనేవి 7 యజ్ఞములు
వాజపేయములు అనేవి 7 యజ్ఞములు
కలిపి మొత్తం 40 సంస్కారములు శాస్త్రము చెప్పినది.
పుత్రులు వారి వివరములు
ఈ దశవిధములుగా జన్మించిన పుత్రులు, దేవ సంబంధ, శాస్త్ర సంబంధ కార్యములు చేయుటకు, అర్హులని వేదములు, ఉపనిషత్తులు చెబుచున్నాయి. దేవీ భాగవతము నుండి.
1.అంశజుడు :- అగ్ని సాక్షిగా స్వీకరించిన (గృహస్తాశ్రమ ధర్మంలో) భర్తవలన జన్మించినవాడు.
2.పవిత్రుడు:- గృహస్తుకు పుత్రులు లేనప్పుడు కేవలం స్త్రీలు(ఆడ సంతానం)మాత్రమే కలిగి ఉన్నప్పుడు, మొదటి కుమార్తెకు పుట్టిన మొదటి కుమారుడు. (గృహస్తు కన్యాదానము చేసిన మొదటి కుమార్తెకు)
3.క్షేత్రకుడు:- గృహస్తుకు ఏకారణము చేతనైనా సంతాన వంతుడు కాలేక పోయినప్పుడు, అగ్ని సాక్షిగా స్వీకరించిన భర్త అనుజ్ఞు ఆదేశము మేరకు మునుల యొక్క ఆహ్వానము మేర సమాజోద్దరణకు జన్మించినవాడు
. 4.గోళకుడు:- ఏ కారణము చేతనైనా ఒక స్త్రీ వైధవ్యమును పొంది, మరలా వివాహమాడి నటువంటి స్త్రీలకు జన్మించినవాడు. (వితంతు సంతానము)
5.కుంభకుడు :- ఉపగ్రస్తకు జన్మించినవాడు.
6.మహోధుడు:- వివాహము నాటికే స్త్రీ గర్భము దాల్చియుండి, వివాహానంతరము జన్మించినవాడు.
7.కాణ్వికుడు:- వివాహ పూర్వము కన్నెగా ఉన్నప్పుడు పుట్టినవాడు.
8.క్రీపుడు:- గృహస్తు అర్థము( ధనము) నిచ్చి కొనబడినవాడు.
9.వనప్రాప్తుడు:- గృహస్తుకు వనములలో లభించినవాడు.
10. దత్తుడు:- గృహస్తుకు సంతానము లేక ఇక సంతానము కలుగదని నిర్ణయించుకొన్న తర్వాత, వేరొకరి బిడ్డను వేదాభిమతముగ శాస్త్ర బద్దముగా, అగ్ని సాక్షిగా స్వీకరింప బడినవాడు.