వ్యవసాయము:
పరమేశ్వర కృపతో ఈ భూమిపైకి వచ్చిన ప్రతి మానవ ఉపాధి, కర్మ వ్యవసాయం చేయాలి. హృదయమునే క్షేత్రముగా అందులో పూజ, సంధ్యావందనము, భక్తి, అనే విత్తనములు చల్లాలి. సాధన అనే పంపుతో మనసు అనే నీటితో ఈ హృదయ భూమిని తడపాలి. ఈ పొలములో పండిన పంటను కాపాడుకోవటానికి, ఈ పొలానికి “ధర్మో రక్షతి రక్షితః”కావున ధర్మమము అనే కంచెను నాలుగు వైపులా వేయాలి. అపుడు అరిషడ్వర్గములనే పశువులు, జంతువులు, వచ్చి పంట పొలమును,పండిన పంటను పాడు చేయవు. అలా ధర్మమము కాపలాతో మనము వ్యవసాయము చేస్తే మనకు శాంతి, తృప్తి అనాయాస మరణము, అనే ఫలాలను అందిస్తాయి. ఈ ఉపాధికి అంతకు మించి వేరే అవసరము లేదు.