Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

సరస్వతి అలంకారం Stuti Sarasvati Alamkaaram

మాణిక్యవీణాం ముపాలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం
మాహేంద్రనీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాంమనసా స్మరామి
చతుర్భుజే చంద్రకలవతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తేజగదేకమాతః
నవరాత్రులలో చివరి మూడురోజులు అత్యంతప్రాముఖం సంతరించుకొన్నవి, శరన్నవరాత్రులలో సరస్వతీపూజ చేయడం సంప్రదాయం.
సరః అంటే శరణం / వ్యాప్తి చెందినది అని, భాషాసారస్వతాలు వ్యాప్తి చెందుతాయి, శబ్దం సర్వవ్యాపితమవుతూనే ఉంటుంది, అమ్మవారు శరత్కాలచంద్రుని వంటి ప్రకాశంతో గౌరవర్ణంతో ఒప్పారుతూ ఉంటుంది. " ఘంటాశూల హలాని, శంఖముసలే చక్రం, ధనుస్సాయకం హస్తాబ్జైర్ధతీం...." అని కూడా వర్ణించారు.
ఏ విద్య నెర్వాలన్నా, ఏ కళలోనైనా ప్రావీణ్యం సంపాదించాలన్నా, అమ్మవారి ఆశీస్సులు, అనుగ్రహం తప్పక ఉండాలి. వ్యక్తిని మంచి శక్తిగా మార్చగల మహత్తు "విద్య" కు మాత్రమే ఉన్నది. అట్టి విద్య కు అధిష్టాన దేవత, పరాశక్తి అంశ, సరస్వతిని స్మరించటం ఇహపరసాధనమైనది.

Popular Posts

Popular Posts

Ads