Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

గోదావరి మాతకు పుష్కర వైభవం Durga Godavari Pushkar glory Godaavari Maataku Pushkara Vaibhavam

గోదావరి మాతకు పుష్కర వైభవం
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో కలిసినట్టు ఈ గోదావరి మాత మహారాష్ట్ర నాసిక్ లో పుట్టి సుమారు వేయిమైళ్ళకు పైగా ప్రవహిస్తూ చివరకు తూర్పున బంగాళాఖాతం లో సాగర సంగమమైన గోదావరి నదీమతల్లి పూర్వవృత్తాంత కధ ఏమిటో? అసలు “పుష్కరుడు” అంటే ఎవరు? పుష్కర సమయం దైవజ్ఞులు” ఎలా నిర్ణయిస్తారు? ఆయా రోజుల్లో భక్తులు చేయవలసిన విధులు ఏమిటి? ఈ పుష్కర సమయంలో చేయకూడని కార్యక్రమాలు, విధిగా చేయవలసిన దానధర్మాలు,పితృ కార్యక్రమాలతో పాటు ఈ గోదావరి మహత్యం పై మన దైవఘ్నులు, మహర్షులు, మన పురాణములు మనకు అందించిన విషయాలను ఒక్కసారి సమీక్షిన్చుకుందాం.

పూర్వం ‘నైమిశారణ్యంలో’ శౌనకాది మునులందరు కలసి ‘సత్రయాగము’ చేసే సమయం లో యాగ విరామ సమయంలో కుడా సత్ కాలక్షేపం చేయడం ఎంతో శుభప్రదమని తెలిపిన ‘సూతముని శ్రేష్ఠుడు’ వివిధ పురాణగాధలు వివరిస్తూ! మహర్షుల కోరిన మేర గోదావరి పుష్కర కధ ఇలా వివరించారు.
గో కళేబరమును ఆవరించి ప్రవహించినది కావున “గోదావరి” అని పేరు వచ్చినది.బృహస్పతి ప్రతిరాశిలోను ప్రవేశించు ఒక్కో సంవత్సర సమయాన్నిఒక్కొక్క నదికి ఇలా పుష్కర సమయాన్ని బ్రహ్మ నిర్దేశిస్తాడు.

‘కృతయుగంలో’ పరమశివుడు ‘తుందిలుడు’ అను మహాతపస్వికి వాని తపస్సును ఎంతగానో మెచ్చినవాడై అతనికి మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్ధాలకు ఆధిపత్యాన్ని ఇస్తూ ‘తుందిలుని’ అధిపతి గా చేయడమే కాకుండా పరమశివుడు తన అష్టమ స్థానములో ఒకడైన జలస్థానం తుందిలునకు శాశ్వత స్థానం కలిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన చతుర్ముఖ బ్రహ్మ పరమశివుని ప్రసన్నం చేసుకుని ఆ జలసార్వభౌముడు – పుష్కరుని తన సృష్టి కార్య నిర్వహణకు తోడ్పడే విధం గా తనకు ప్రసాదించమని ప్రార్ధిస్తాడు.
అందులకు పరమేశ్వరుడు పరమానందభరితుడై ఆ పుష్కరుని వరప్రసాదం గా ఇస్తాడు. బ్రహ్మ ఎంతగానో సంతసించి ఎంతో మహిమాన్వితుడైన ఆ పుష్కరుని తమ కమండములన ధరించి “సృష్టి కార్యం” ప్రారంభిస్తాడు.

ఇది ఇలా ఉండగా! బృహస్పతి బ్రహ్మను గురించి ఘోరతపస్సు చేసి సకల ప్రాణులకు జీవనాధారుడైన ‘పుష్కరుని’ తనకు అనుగ్రహించమని కోరతాడు. అది విన్న పుష్కరుడు బ్రహ్మను వీడి వెళ్లేందుకు అంగీకరించడు.దానితో బ్రహ్మ చేసేది లేక ఉభయతారకమైన ఒక నియమాన్ని ఇరువురికి పెట్టి అటు పుష్కరుడు ఇటు బృహస్పతి ఎంతగానో సంతసిoచేలా చేస్తాడు. అనగా బృహస్పతి ప్రతి రాశి లోను ప్రవేశించు ఒక్కో సంవత్సర సమయాన్ని ఒక్కొక్క నదికి ఇలా పుష్కర సమయాన్ని నిర్దేశిస్తాడు
మహారాష్ట్ర నాసిక్ లో పుట్టి సుమారు 1665 మైళ్ళకు పైబడి ప్రవహీంచి చివరకు తూర్పున బంగాళఖాతంలో సాగర సంగమమవుతుంది. ఈ నది

తేది దైవం పేరు – దానములు/పూజలు
1 నారాయణ – ధాన్యము,రజితము,సువర్ణము
2 భాస్కర – వస్త్రము,లవణము,గోవు,రత్నము.
3 మహాలక్ష్మి – బెల్లము,కూరలు,వాహనము
4 గణపతి – నేయి,నువ్వులు,తేనె,పాలు,వెన్న
5 శ్రీకృష్ణ – ధాన్యము,బండి,గేదె,ఎద్దు,నాగలి
6 సరస్వతి – కస్తూరి,గంధపుచెక్క,కర్పూరము.
7 పార్వతి – గృహము,ఆసనము,శయ్య.
8 పరమేశ్వరుడు- కందమూలములు,అల్లము,పుష్పమూలము
9 అనంత – కన్య,పఱుపు,చాప
10 నరసింహ దుర్గ,లక్ష్మి,దేవి పూజ,సాలగ్రామం
11 వామన కంబళి,సరస్వతి,యజ్నోపవీతము,వస్త్రము,తాంబూలము
12 శ్రీరామ – దశ,షోడశ మహాదానములు

నదుల ప్రాశస్త్యము


భారతదేశం ఎన్నో పుణ్యనదులు, తీర్ధాలకు నిలయం. ఇవన్నీ భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో స్నానమాచరిస్తే అనంత పుణ్యాన్ని, అత్మతత్వాన్ని ప్రసాదింపజేసి పునర్జన్మరాహిత్యాన్ని కలిగిస్తాయి.
భారతదేశం ఖండాంతరాల్లో పెరుగాదించడానికి మూలకారణం ఈ దేశం యొక్క నగ-నన-నదీ-తీర్థ కలయికతో గూడిన ప్రకృతి.
ఋగ్వేదంలో నదుల మహిమల గురించి ఇలా చెప్పారు. “గంగానదీ తీరమున దానం చేయటంవల్ల మానవుడు పరితాత్ముడౌతాడు. సరస్వతీ మొదలగు ప్రఖ్యాతాలైన పుణ్యనదీతీరముల యందు యజ్ఞాది వైదికకర్మలను ఆచరించుట చాలా మంచిది. సరస్వతీనది శ్రేష్ఠమైన తల్లిగా సంబోధింపబడింది".
నదిలో కొన్ని పవిత్ర స్థలాలున్నాయి. తైత్తిరీయ సంహిత ఇలా చెప్పింది -
తీర్థే, స్నాయి తీర్థమేవ సమానానాంభవతి
నదులన్నీ దైవతాలుగా ప్రస్తావింపబడ్డాయి. సరస్వతీ నది సర్వోత్తమమైన నదీదేవత.
మన దైనందినజీవితంలో శ్రౌత, స్మార్తాది కర్మలలోని కలశారాధనలో నదులపేర్లను ఈ విధంగా స్మరిస్తాం.

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి,
నర్మదే సింధు కావేరి, జలే స్మిన్ సన్నిధం కురు ||

“దివ్యములైన ఈ జలాలు మంగళకరాలైన మా అభీష్టమును తీర్చుగాక! మాకు త్రాగుటకు అనువైన నీటిని ఇచ్చుగాక! మావైపు ప్రవహించు గాక!” ఇవి జలవైశిష్ట్యాన్ని సంపూర్ణంగా అర్థంచేసుకున్న వేదఋషులు త్రికరణశుద్ధిగా జలదేవతను ప్రార్థించిన మంత్రం యొక్క భావం.
ఇంటిలో స్నానం చేస్తున్నా కూడా “గంగేచ యమునే కృష్ణేగోదావరి సరస్వతి" అంటూ ఆ నదులను స్మరిస్తూ చేసే స్నానం వల్ల వచ్చే ఫలాలను అర్షులు ఇలా చెప్పారు.
నదీస్నానం చేస్తే శారీరకంగా కనబడే మాలిన్యం పోతుంది.
నిండు ప్రవాహమున్ననదిలో స్నానం చేయడంవల్ల శరీర మంతటికీ సుఖస్పర్శ కలిగి శరీరంలో ఉష్ణాధిక్యత తగ్గుతుంది.
నడీనీటిలోని చల్లదనం ఇంద్రియతాపాలను తగ్గించి మనస్సుకూ, వాక్కుకూ శుచిత్వాన్ని కలిగిస్తుంది. కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధిస్తుంది.
పుణ్యనదీతీర్థాల్లో చేసే స్నానం మనసుకు ఏకాగ్రతనిస్తుంది.
తీర్థమందు స్నానం చేసినవాడు తనకు సంబంధించిన వారిలో చాలా శ్రేష్ఠమైన వాడవుతాడు.
మహర్షుల యొక్క దీక్షా, తపస్సుల విశేషాలు, శక్తి నదీ జలాల్లో ఉన్నవని వేదం నిర్దేశించింది. కావున నదీస్నానంచే వాటిని మనము స్వీకరించి పవిత్రులమౌతాం.
అందుచేతే నదీజల స్నానం సర్వథా, సర్వదా యోగ్యమని అర్షుల వాక్కు.
భారతదేశంలో పుణ్యనదులకు కొరతేలేదు. పుట్టింది మొదలు మానవులు చేసే పాపాలు విశిష్టదినాల్లో అనగా – పుష్కర సమయంలో, గ్రహణ సమయాల్లోను, మకర సంక్రమణ సమయంలో, కార్తీక, మాఘమాసాల్లో నదీ స్నాన మాచారిస్తే త్రికరణశుద్ధిగా పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి.
గంగానదీ స్నానం అరవైయోజనాల పవిత్ర ప్రదేశం. అరవై పాపాలు హరించే పుణ్యమూర్తి. గంగాద్వారా స్నానఫలం దీనికి రెట్టింపు.
యమునానదీ తీరం ఇరువది యోజనాలు విస్తరించి, ఇరవై రకాల పాపాలు పరిహరిస్తుంది.
సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించి ఇరవైనాలుగు యోజనాలు విస్తరించిన ఈ నది ఇరవై పాపాలు పోగొడుతుంది.
వరుణ, కుశావర్త; శతద్రువు; విపాశక; శరావతి; వితస్త; ఆశిక్ని; మధుమతి; ఘ్రుతవతి; మొదలిఅన నదీతీరాల్ సందర్శనం శుభప్రదం. దేవనడిగా ప్రఖ్యాతమైన ఆ నదీ పరీవాహక ప్రాంతం పదియోజనాలు విస్తరించి; పదిహేను రకాల పాపాలను పోగొడుతుంది. రేవానదీ స్నానం బ్రహ్మ హత్యాపాతకాన్ని నాశనం చేస్తుంది. చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, కౌశిక, మందాకినీ, సహస్త్రవక్ర్త, పూర్ణ, పుణ్య, బాహుదాలనే నదులు పదహారు యోజనాలు విస్తరించాయి. నదీ సంగమ ప్రదేశాల్లో చేసే స్నానం, సంధ్యాదికాలు అనంత పుణ్యఫలాలనిస్తాయి.
గోదావరీతీరం ఆరు యోజనాలు విస్తరించి ఉంది. ఒక్కసారి గోదావరి తీరం చుట్టి వచ్చినవారికి “వాజపేయ” యాగ ఫలం లభిస్తుంది.
భీమేశ్వరం, వంజర సంగమస్థానాలు ప్రయాగాతో సమానం. ద్వాదశ యోజనాలు విస్తరించిన కుశస్థలీనది ముప్ఫై ఆరు పాపాలను, పూర్ణానది యాత్ర ముప్ఫై పాపాలను, కృష్ణవేణి పదిహేను పాపాలను, తుంగభద్ర ఇరవైపాపాలను ప్రక్షాలనం చేస్తాయి.
పంపాసరోవర శక్తి అనంతం. పాండురంగా మాతులింగ, గంధర్వ నగరాలు తీర్థాలతో విలసిల్లుతున్నాయి. రామేశ్వరంలో 108 తీర్థాలు, ఆదివరాహక్షేత్రమైన తిరుమలలో దాదాపు 18 తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి పుణ్యఫలం కలుగుతుంది.
మహానది, తామ్రపర్ణి నదుల పుణ్యం వర్ణశక్యముకాదు. కుంభకోణంలో స్నానం సమస్త తీర్థాల సమానం.
కొన్ని సమయాల్లో నదులు, తీర్థాలలో స్నానమాచరించటం నిషేధించటం జరిగింది. రవి కర్కాటకంలో ఉన్న సంక్రమణ సమయం రెండుమాసాలు నదీ రజస్వల సమయం. ఆ సమయంలో నదీస్నానం దోషం. నదీ తీరప్రాంత వాసులకు ఈ దోషముండదు.
నదీ రజస్వల అంటే, కొత్తనీరు రావటమన్న మాట. అప్పుడు స్నానం చేయడం, మహాదోషం. తీర్థసేవన విషయంలో ఇది సాధారణ విషయమైనా, ఈ సమయంలో తీర్థ దర్శనం చేయవలసివస్తే స్నాన, క్షౌర, ఉపవాసాదులు ఆచరించాలి. కాబట్టి “జాగ్రత్త" అని హెచ్చరించారు.
ప్రతి నదీ పాపహారిణే, పుణ్యమూర్తే. నది స్త్రీ రూపం. అందుకే స్త్రీలు పసుపు, కుంకుమ, పువ్వులతో విశేషంగా నదిని పూజిస్తారు.
ప్రతి జీవనడికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. జీవన ప్రదాతలైన నదులకు కృతజ్ఞత చెప్పటం పుష్కరాల ప్రధానోద్దేశం. పెద్దలకు పిండ ప్రదానం చేసి పితృఋణం తీర్చుకోవటం ఒక ధార్మిక, సాంస్కృతిక ప్రయోజనం.
మేషం మొదలైన పన్నెండు రాశులలో బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కో సంవత్సరం ఉంటాడు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినపుడు గోదావరి నది పుష్కరాలు వస్తాయి. అలాగే కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించినపుడు కృష్ణానదికీ పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో నదీస్నానం చేస్తే వెయ్యి గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది.

Popular Posts

Popular Posts

Ads